iDreamPost
iDreamPost
రాజస్థాన్‌లో (Rajasthan) కొత్త వధువు తన కన్వత్వాన్ని నిరూపించుకోలేకపోయినందుకు గ్రామ పంచాయితీ రూ.10 లక్షలు జరిమానా విధించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా ఇది నిజమేనని తేలింది. చట్టప్రకారం భర్త, అత్తమామలపై కేసు పెట్టారు. పెళ్లికి ముందే, తనపై అత్యాచారం జరిగిందని, అందుకే తాను కన్యను కానని బాలిక చెప్పింది. వర్జిన్ కాకపోవడంతో, పంచాయితీ ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో, పెళ్లి తర్వాత వధువుకు కన్యత్వ పరీక్ష పెట్టారు. అందులో ఆమె విఫలమైందంటూ అత్తమామలు ఇంటికి రావద్దన్నారు. ఇది చాలదన్నట్లుగా, ఆమెను పంచాయితీకి పిలిచారు. అమ్మాయితోపాటు, ఆమె కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఇదంతా కన్యత్వ పరీక్ష(virginity test)లో ఆమె పాస్ కానుందుకంట. ఈ 10 లక్షలు ఇవ్వకపోవడంతో అమ్మాయిని, ఆమె కుటుంబసభ్యులను కూడా అత్తమామలు వేధించారని పోలీసులు చెబుతున్నారు.
24 ఏళ్ల యువతికి మే 11, 2022న బాగోర్‌లో పెళ్లి అయ్యింది. మరుసటి రోజు ఆమె సమాజంలోకి ఆచారమైన ‘కుక్డీ’ విధానంలో ఆమె కన్యత్వ పరీక్ష జరిగింది. ఆమె పాస్ కాలేదు.
ఆమెను అడిగితే, పెళ్లికి ముందే ఆమె స్థానికంగా ఉండే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. అంతే, భర్త, అత్తగారు ఆమెను కొట్టారు. ఆ తర్వాత బాగోర్‌లోని భాదు మాత ఆలయంలో పంచాయితీ జరిగింది.
ఏంటీ కుక్డి(kukdi) ఆచారం?
రాజస్థాన్ లోని సాంసీ సమాజం( Sansi communityRe)లో “కుక్డి” ఆచారం ఇప్పటికీ ఉంది. పెళ్లయిన అమ్మాయిలు “స్వచ్ఛత” అంటే కన్యత్వానికి రుజువు ఇవ్వాలి. పెళ్లి రాత్రి, భర్త తన భార్యకు తెల్లటి వస్త్రాన్ని ఇస్తాడు. తొలిరాత్రి ఆ షీట్ మీద ఉన్న రక్తపు మరకను మరుసటి రోజు బంధువులకు చూపించాలి. రక్తం మరక ఉంటేనే ఆమె పవిత్రంగా పరిగణిస్తారు. రక్తపు జాడ లేకుంటే, కమ్యూనిటీ పంచాయతీ, అమ్మాయి కుటుంబం నుండి మరింత కట్నం డిమాండ్ చేస్తుంది.