iDreamPost
android-app
ios-app

గాడ్ ఫాదర్ కు పాన్ ఇండియా స్కెచ్

  • Published Aug 15, 2021 | 9:04 AM Updated Updated Aug 15, 2021 | 9:04 AM
  • Published Aug 15, 2021 | 9:04 AMUpdated Aug 15, 2021 | 9:04 AM
గాడ్ ఫాదర్ కు పాన్ ఇండియా స్కెచ్

మొత్తానికి మొన్న ప్రచారంలోకి వచ్చినట్టే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించడం దాదాపు కన్ఫర్మ్ అయ్యిందని టాక్. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ చేసిన పాత్రను ఇందులో సల్లు భాయ్ తో వేయించబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే నెరేషన్ వినిపించారని మెగా ఫ్యామిలి తో ఉన్న అనుబంధం దృష్ట్యా సల్మాన్ ఖాన్ ఓకే చెప్పారని ముంబై న్యూస్. ఇది చిన్న విషయం కాదు కాబట్టి గ్రాండ్ గా అనౌన్స్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలిసింది. ఒక చిన్న ఈవెంట్ లాంటిది చేసి ప్రత్యక్షంగా సల్మాన్ సమక్షంలోనే చేప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హిందీ స్టార్లు తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమి కాదు. అనిల్ కపూర్ డెబ్యూ చేసిన మణిరత్నం కన్నడ మూవీ పల్లవి అనుపల్లవి, బాపు గారు తీసిన వంశవృక్షం ద్వారా ఇక్కడ తన తొలి అడుగులు మొదలుపెట్టాడు. అమితాబ్ బచ్చన్ రెగ్యులర్ గా కాదు కానీ అడపాదడపా చేసిన దాఖలాలు ఉన్నాయి. మొన్న సైరాలో కూడా క్యామియో చేశారు. సంజయ్ దత్ అప్పుడెప్పుడో నాగార్జున చంద్రలేఖలో తళుక్కున ఒక సీన్ లో కనిపించి మాయమవుతారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు ట్రై చేయలేదు కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సల్మాన్ ఫ్యాన్స్ కోరిక ఈరకంగా మెగా మూవీ ద్వారా తీరబోతోందన్న మాట.

ఫైట్ ఎపిసోడ్ తో లూసిఫర్ రీమేక్ ని మొదలుపెట్టిన చిరంజీవి రామ్ చరణ్ తిరిగి రాగానే బాలన్స్ ఉన్న ఆచార్యని పూర్తి చేస్తారు. గాడ్ ఫాదర్ అనే టైటిల్ పైన చెప్పిన రీమేక్ కి గట్టి ప్రచారం జరుగుతోంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనని చెబుతున్నారు. మెహర్ రమేష్ తో చేయబోతున్న వేదాళం రీమేక్ తాలూకు పనులు కూడా ఆల్రెడీ ఒక కొలిక్కి వచ్చాయి. చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ఓకే చెప్పిందన్న వార్త వచ్చినప్పటి నుంచి దీని మీద ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటితో లెక్కబెడితే రాబోయే ఏడాదిన్నర కాలంలోనే చిరంజీవి మూడు సినిమాలు రావడం దాదాపు ఖాయం. ఇదే జరిగితే చాలా గ్యాప్ తర్వాత ఇంత వేగంగా చిరు సినిమాలు వచ్చినట్టు అవుతుంది

Also Read : యంగ్ టైగర్ కింగ్ ల పోటాపోటీ హంగామా

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet