iDreamPost
android-app
ios-app

జగన్ తొలి ఎన్నికల ప్రత్యర్థి పాళెం శ్రీకాంత్‌ రెడ్డి మృతి

  • Published Aug 12, 2020 | 1:14 PM Updated Updated Aug 12, 2020 | 1:14 PM
జగన్ తొలి  ఎన్నికల ప్రత్యర్థి పాళెం శ్రీకాంత్‌ రెడ్డి మృతి

ప్రముఖ పారిశ్రామిక వేత్త పాళెం శ్రీకాంత్‌ రెడ్డి మృతి చెందారు. ఇటీవల ఆయన కరోనా సోకింది. హైదారాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ   రోజు మధ్యాహ్నం మరణించారు.

కడప జిల్లా కమలాపురానికి చెందిన పాళెం శ్రీకాంత్ రెడ్డి తిరుచ్చి rec లో ఇంజినీరింగ్, స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివి మొదట ఐటీ లో పనిచేసి తరువాత సొంతంగా Palred Technologies Ltd కంపెనీ నడిపారు. శ్రీకాంత్ రెడ్డి అన్న శ్రీకర్ రెడ్డి Sonata software కంపినీ MD &CEOగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి తండ్రి చెన్నకేశవరెడ్డి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన 96 సంవత్సరాల వయస్సులో గత ఫిబ్రవరిలో చనిపోయారు.

పాళెం శ్రీకాంత్‌ రెడ్డి జగన్ తొలి ఎన్నికల ప్రత్యర్థి. 2009 ఎన్నికల్లో కడప లోక్‌సభ నుంచి పోటీ చేసిన ‌జగన్ మీద టీడీపీ అభ్యర్థిగా పాలెం శ్రీకాంత్ రెడ్డి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో జగన్ లక్ష అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

యువ పథం పేరుతొ ఒక సంస్థను నడుపుతున్న పాళెం శ్రీకాంత్ రెడ్డి ని చంద్రబాబు పిలిచి కడప లోక్ సభ టికెట్ ఇచ్చారు.

2014 ఎన్నికల ముందు జనపాలన పేరుతో ఒక రాజకీయ సంస్థను స్థాపించి రాజకీయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రచారంచేశారు. 2019 ఎన్నికల్లో తిరుపతి లాంటి కొన్నిచోట్ల పోటీచేశారు కానీ ఎక్కడా ప్రభావం చూపలేదు. 

2017/2018లో “మోడరన్ రాయలసీమ” పేరుతొ ఒక రాజకీయేతర సంస్థను స్థాపించి మన రాయలసీమ – మన అభివృద్ది నినాదంతో అనేక సభలు నిర్వహించారు. ప్రజా సామస్యల మీద క్రియాశీలకంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి అకాల మరణం దురదృష్టకరం.