iDreamPost
android-app
ios-app

వీడియో: మద్యం సేవించి కారు డ్రైవ్..  బైకును ఢీకొట్టడంతో..!

వీడియో: మద్యం సేవించి కారు డ్రైవ్..  బైకును ఢీకొట్టడంతో..!

రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు? ఎలా? జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. కొన్ని యాక్సిడెంట్స్.. ప్రమాదవశాత్తు జరిగితే- కొన్ని మాత్రం వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంటాయి. కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అభం శుభం తెలియని వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా సంపాదించే వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున కూడా పడుతున్నాయి. కొందరు చేసే నిర్లక్ష్యపు పనుల వల్ల అమాయకులు ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఈ ఘటన ఏలూరు పరిధిలో జరిగింది. ఏలూరు జోగన్న పాలెం రోడ్డులో ఓ పాల వ్యాపారి తన బండి మీద పాలు అమ్మేందుకు వెళ్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా తన పని మీద బయటకు వచ్చాడు. కానీ, అతనికి తెలీదు ఈరోజు ఒక మూర్ఖుడు చేసిన పనికి తన ప్రాణాలు పోతాయని. అలా రోడ్డు మీద వెళ్తుండగా.. ఎదురుగా వైట్ కలర్ స్విఫ్ట్ కారు రూపంలో అతడిని మృత్యువు పలకరించింది. అతి వేగంగా వచ్చిన కారు ఇతని వాహనాన్ని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కారు వేగంగా పక్కనే ఉన్న పందిరిని ఢీకొట్టి కందకంలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో పాల వ్యాపారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన దారిన తాను రోడ్డు పక్కన వెళ్తున్నా కూడా ఒక తాగుబోతు వల్ల అతని ప్రాణాలు పోయాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత హెచ్చరించినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కూడా కొందరు మాత్రం వారి తీరును మార్చుకోవడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ.. వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా.. ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet