మన తాతలు, ముత్తాలతో పోల్చుకుంటే ఈరోజుల్లో మనుషుల్లో పోరాట పటిమ తగ్గిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా చాలా మంది యువత మరీ పిరికివారికగా తయారవుతున్నారు. చదువుల్లో ఫెయిల్ అవ్వడం, ఆటల్లో రాణించలేకపోవడం, ప్రేమించిన అమ్మాయి నో చెప్పడం, పక్కింటి వాడికి ఎక్కువ మార్కులు రావడం ఇలా కారణం ఏదైనా సరే.. ఆత్మహత్యే సరైన పరిష్కారంగా భావిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. అలాగే ఓ యువతి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. దుండిగల్ పోలీస్ స్టేషన పరిధి.. బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన సౌజన్య ఇటీవల డిగ్రీ పరీక్షలు రాసింది. డిగ్రీ ఫెయిల్ కావడంతో చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటోంది. అయితే ఆమె డిగ్రీ ఫెయిల్ అయినప్పటి నుంచి తమ ఫ్రెండ్స్, ఇతరులు ఎవరూ సరిగ్గా మాట్లాడటం లేదని బాధపడుతోంది. ఆ బాధ కాస్తా డిప్రెషన్ గా మారిందో ఏమో.. జూన్ 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన సౌజన్య తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు.
పోలీసులు వెతుకుతుండగా.. వారికి బహదూర్ పల్లి సమీపంలోని చెరువులో యువతి మృతదేహం ఉన్నట్లు పోలసులకు సమాచారం అందింది. అది సౌజన్య మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ కూడా దొరికినట్లు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదంటూ మానసిక ఆరోగ్య నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. లైఫ్ లో చదువు అనేది సక్సెస్ కి ఒక మెట్టు లాంటిది. కానీ, చదువే జీవితం కాదు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి.