iDreamPost
android-app
ios-app

Harley Davidson X440: హార్లే డేవిడ్ సన్ న్యూ మోడల్.. బుల్లెట్ కంటే తక్కువ ధరకే..!

Harley Davidson X440: హార్లే డేవిడ్ సన్ న్యూ మోడల్.. బుల్లెట్ కంటే తక్కువ ధరకే..!

బైక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందులోనూ హై సీసీ బండి అంటే యువత పడి చచ్చిపోతుంది. ఎవరిని అడిగినా వాళ్ల డ్రీమ్ బైక్ ఏది అంటే కచ్చితంగా హార్లే డేవిడ్సన్ అంటారు. కానీ, ఆ బైకులను కొనాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు హార్లే డేవిడ్సన్ బడ్జెట్ రేంజ్ లో బైక్ తీసుకొచ్చింది. అది కూడా ఇప్పుడు ఎంతో ఇష్టపడి కొంటున్న బుల్లెట్ ధర కంటే కూడా తక్కువకే తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ హార్లే డేవిడ్సన్ ఎక్స్440ని మొత్తం మూడు వేరియంట్లలో విడుదల చేశారు. డెనిమ్, వివిడ్, ఎస్ వేరియంట్లు ఉన్నాయి. ఇంక ఈ మోడల్స్ ఎక్స్ షోరూమ్ ధరల విషయానికి వస్తే.. డెనిమ్ రూ.2.29 లక్షలు, వివిడ్ రూ.2.49 లక్షలు, ఎస్ రూ.2.69 లక్షలుగా నిర్ణయించారు. రాయల్ ఎన్ఫీల్డ్ చాలా మోడల్స్ తో పోలిస్తే.. ఈ ధర తక్కువగానే ఉంది. కానీ, ఎన్ఫీల్డ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ.35 వేలు మాత్రమే ధర ఎక్కువ.

ఇంక పీచర్స్ విషయానికి వస్తే.. వేరియంట్ మారుతున్న కొద్దీ ఈ ఫీచర్స్ మారుతూ ఉంటాయి. బేస్ మోడల్ లో వైర్ స్పోక్ రిమ్స్, మినిమం బ్యాడ్జింగ్ ఉంటుంది. మిడ్ వేరియంట్ లో అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్స్ తో వస్తోంది. టాప్ వేరియంట్ ల మీకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఇంజిన్ కూలింగ్ పిన్స్, బ్లూటూత్ కనెక్టెవిటీ, 3డీ బ్యాడ్జింగ్ వంటి కూల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో నావిగేషన్ కూడా ఉండటం మరో ఆకర్షించే అంశం. అయితే ధర తక్కువ కాబట్టి సీసీ చాలా తక్కువ అనుకుంటే మీరు ఇంజినాయిల్లో కాలేసినట్లే.

440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 27 హెచ్పీ, 4000 ఆర్పీఎం, 38 ఎన్ఎం టార్క్ తో వస్తోంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. మరోవైపు భారతదేశ రోడ్లకు అనుగుణంగానే సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్స్ ని అందిస్తున్నారు. ఈ రేంజ్ లో, ఈ ధరలో హార్లే డేవిడ్సన్ బైక్ రిలీజ్ చేసిందని తెలిసుకుని మార్కెట్ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో జెండా పాతేందుకే హార్లే డేవిడ్సన్ ఈ రేంజ్ లో బైక్ రిలీజ్ చేసిందని చెబుతున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లో రావడం వల్ల ఎన్నో కంపెనీలకు హార్లే డేవిడ్సన్ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.