Idream media
Idream media
వినూత్నమైన సంక్షేమ పథకాలతో ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. మరో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి పూచికత్తు, వడ్డీ లేకుండా చిరు వ్యాపారులకు పది వేల రుణం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హమీని అమలు చేయబోతున్నారు. జగనన్న తోడు పేరుతో అమలు చేసే అ పథకం కేవలం చిరు వ్యాపారులకే గాక .. పాడి, గొర్రెలు, మేకల పెంపకందార్లుకు కూడా అర్హులుగా చేర్చారు. అర్హుల నుంచి ప్రస్తుతం వాలంటీర్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. వాలంటీర్‌ను సంప్రదిస్తే సరిపోతుంది. వాలంటీరే వారి అర్హుల ఇళ్లకు వస్తారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్‌లోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు వెంటనే చేస్తారు. ఇందుకు దరఖాస్తుదారులు ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కొనుగోలు, లేదా అమ్మకం రసీదు ఇస్తే సరిపోతుంది. పాడి రైతులైతే ఆధార్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకంతోపాటు పాలు విక్రయించే రసీదు అందజేస్తే వాలంటీర్లు పథకానికి దరఖాస్తు చేస్తున్నారు. పథకం ప్రారంభమైన తర్వాత పది వేల రూపాయలు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ అవుతాయి. సులభమై వాయిదాల్లో తిరిగి అసలు చెల్లించాలి.
వీరు పథకానికి అర్హులు..
– కూరగాయల వ్యాపారం
– పండ్ల వ్యాపారం
– టిఫిన్ బండ్లు
– కిరాణా షాపు
– ఫ్యాన్సీ షాపు
– బడ్డీ కొట్టు
– పూల వ్యాపారం
– ఆకుకూరల వ్యాపారం
– లెసు వర్కు
– మగ్గం పని
– కుమ్మరి
– కలంకారి
– ఏటుకొప్పాక బొమ్మల తయారీ
– కొండపల్లి బొమ్మలు
– తోలు బొమ్మలు
– బొబ్బలి వీణ
– ఇత్తడి వస్తువల తయారీ
– ఇనుప సామాన్ల తయారీ
– పశు పోషణ,
– గొర్రెలు, మేకల పెంపకం