Dharani
ఏపీలోకి కొందరికి జగన్ సర్కార్ నేడు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో 10 వేల రూపాయల నుంచి లక్ష వరకు జమ చేయనుంది. ఆ వివరాలు..
ఏపీలోకి కొందరికి జగన్ సర్కార్ నేడు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో 10 వేల రూపాయల నుంచి లక్ష వరకు జమ చేయనుంది. ఆ వివరాలు..
Dharani
రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని.. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకరకాల పథకాలను తీసుకువచ్చారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి.. ప్రజల సంక్షేమమే తన ధ్యేయం అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆదుకునేలా రకరకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు సీఎం జగన్. అంతేకాక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. దీంతో అవినీతికి తావు లేకుండా.. ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతుంది. రాష్ట్రంలో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తుంది ఏపీ సర్కార్. ఈ క్రమంలో తాజాగా వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..
సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా ఎవరికైనా లబ్ధి అందకపోతే.. వారికి ప్రతి ఏటా రెండుసార్లు.. జనవరి, జూన్ లో తిరిగి ఆ పథకాలకు సంబంధించిన మొత్తాన్ని అందిస్తుంది జగన్ సర్కార్. జనవరి, జూన్ లో అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి అందని అర్హులకు జూన్ / జూలైలో.. అలానే జూలై నుంచి డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ / జనవరిలో ఆ పథకాలకు సంబంధించిన మొత్తాన్ని అందిస్తోన్నారు. ఈ క్రమంలోఆగస్టు 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి అందని 68,990 అర్హులకు ఆయా పథకాలకు సంబంధించిన మొత్తాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.
ఈ క్రమంలో జగన్ నేడు.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి 68,990 అర్హుల ఖాతాల్లో రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు మొత్తంగా రూ. 97.76 కోట్లను జమ చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ది అందించాలన్నది సీఎం జగన్ సంకల్పం. అందుకే పథకం లబ్ది అందించిన తర్వాత కూడా అర్హులై ఉండి.. మిస్ అయిన వారికి మరో అవకాశం ఇస్తోంది ప్రభుత్వం. 6 నెలల కాలానికి సంబంధించి అందించిన సంక్షేమ పథకాలకు అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి మిస్ అయిన వారికి మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం.
అర్హులై ఉండి పథకాల లబ్ధి అందని.. వారు నెల రోజుల గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే వాలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902 కి ఫోన్ చేస్తే వారు సాయం చేస్తారు. లబ్ధి అందని వారు.. ఆయా పథకాలకు అవసరమైన పత్రాలతో సచివాలయాల్లో అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసి ఆరు నెలలకోసారి ఆ మొత్తాన్ని జమ చేస్తారు. ఆ 6 నెలల వ్యవధిలో అమలు చేసిన ఆయా సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తాన్ని అర్హులకు అందజేస్తారు.
ఇలా ఏటా రెండుసార్లు డబ్బుల్ని జమ చేస్తున్నారు. సోషల్ ఆడిట్ కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శిస్తారు. దీనిలో భాగంగా ఆగష్టు 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా పొరపాటున ఆయా సంక్షేమ పథకాల లబ్ధి అందుకోలేకపోయిన అర్హులకు నేడు ఆ నగదు లబ్ధిని అందిస్తున్నారు.