Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కి పెరుగుతున్న ఆదరణకు కారణాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు. ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదే కావడానికి కూడా కారణాలు అవే. దేశంలో ఏపీకి దక్కుతున్న గౌరవం, అందుతున్న ర్యాంకులు జగన్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం జగన్ పథకాలను మాత్రం ఆపడం లేదు. ఇంకా కొత్తవి చేర్చుకుంటూ పోతున్నారు.
ఆయనకున్న ఈ తెగువ ప్రతిపక్షాలకు రుచించడం లేదు. ఏదో విధంగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్నడూ సాగని రీతిలో ఏపీ సంక్షేమ బాటన నడుస్తుంటే, సంక్షోభం సృష్టించేందుకు ఆందోళనలు చేస్తున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లంటూ, ఉద్యోగాలు లేవంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజలకు మేలు చేసే పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నాయి.
జాబ్ కేలెండర్ ను రద్దు చేయమనడం సమంజసమేనా?
ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చుట్టిన రోజునే జగన్ లక్షలాది ఉద్యోగాలకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించి ఎందరికో ఉపాధి కల్పించారు. అంతేకాకుండా శాశ్వతప్రాతిపదికన సుమారు మరో లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను నియమించారు. వారి ద్వారా రెండేళ్లలో 31 రకాల సంక్షేమ పథకాల ద్వారా రూ.1.25 లక్షల కోట్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లబ్ధిదారులకు చేరాయి.
అంతటితో ఆగకుండా జాబ్ కేలండర్ ను విడుదల చేస్తూ జగన్ కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. దాని ద్వారా నెల నెలా భర్తీ చేసే పోస్టుల వివరాలను తెలియజేస్తున్నారు. వాటి కోసం సంసిద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు అది దోహదపడుతోంది. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసే పరిస్థితి నుంచి రోజులకు తెచ్చారు జగన్. కానీ దీనిపై దుష్ప్రచారాలు చేస్తూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. ఆందోళనలు చేయిస్తున్నాయి.
పేదల ఇళ్లపై ఎందుకంత కుళ్లు
30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించి ఏపీ ప్రభుత్వం సంచలనం సృష్టించింది. 25,433 ఎకరాల ప్రభుత్వ భూమితో సహా మొత్తం 68,677 ఎకరాలను ప్లాట్లుగా చేసి పేదలకు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంపై ఎందరో ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జగన్ సాహసోపేత చర్యను అభినందిస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు.. దాదాపు 12.5 లక్షల ఇళ్ల నిర్మాణాలకు ఒకేసారి శంకుస్థాపనలు కూడా చేశారు. నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఆర్థికంగా వెనుకబడ్డ వారికోసం 16,098 కాలనీలను అభివృద్ధి చేస్తున్నారు.
ఇళ్లను కట్టించడమే కాదు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం దాదాపు రూ.12,410 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే, పేదల ఇళ్లపై టీడీపీ విమర్శలు చేస్తోంది. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా ఉచితంగా కనీసం గుడిసెలు కూడా నిర్మించలేని పార్టీ జగన్ నిర్మిస్తున్న ఇళ్లపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా మారింది.
జగన్ పథకాలను ఇలా కొనసాగిస్తూ పోతే.. ఇక రాష్ట్రంలో తమకు రాజకీయ భవిష్యత్ ఉండదనే టీడీపీ ఈ తరహా రాజకీయాలు చేస్తోందన్న అపవాదు మూటగట్టుకుంటోంది. కేంద్ర ప్రముఖులు ఏపీ పథకాలను ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు విమర్శిస్తున్నారు. దీని ద్వారా రాజకీయ లబ్ది ఎలాగున్నా ప్రజలకు మాత్రం నష్టమే. పథకాల అమలుకు అడ్డంకులు సృష్టించడమే.