iDreamPost
iDreamPost
జనం మీ ప్రత్యర్థి గురించి మీరెంత చెప్పినా నమ్మడం లేదనుకోండి..అప్పుడో పనిచేయండి. ప్రత్యర్థి శిబిరంలో బలహీనులను ఆకర్షించి, అక్కడే ఎదురుతిరిగేలా చేయండి. ఎత్తుగడలతో నమ్మకంగా ఉంటున్నట్టు కనిపిస్తూనే నెమ్మదిగా విమర్శల జోరు పెంచమని చెప్పండి. ఈ మాటలు మీరెక్కడయినా విన్నారా.. ఏ రాజకీయ పాఠశాలలోనయినా చెబుతారనుకుంటున్నారా. కానీ ఎవరు చెప్పినా లేకున్నా చంద్రబాబు ఆచరించే రాజకీయ సూత్రమిదే. గతంలో ఎన్టీఆర్ విషయంలోనూ దానిని అనుసరించారు. ఇప్పుడు జగన్ మీద కూడా ప్రయోగించాలని చూస్తున్నారు. కానీ అవకాశం లేకపోవడంతో అక్కడక్కడా అందివచ్చిన చోటా మోటానేతలతో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
నెలరోజుల క్రితం ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే వైసీపీ స్థానిక నాయకుడి తీరు కలకలం రేపింది. ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి. జగన్ ని పొగుడుతూ పార్టీ నేతలను విమర్శించేందుకు ఆయన వైసీపీ కార్యక్రమాన్నే ఎంచుకోవడం వివాదంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆయన కామెంట్ చేసి ఉంటే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదు గానీ ఆయనకు సంబంధంలేని కొడాలి నాని మీద కూడా విమర్శలు చేశారు. నాని వల్ల ఆయనకు అవమానం జరుగుతోందన్నట్టుగా వ్యాఖ్యానించడం, దానిని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం చకచకా జరిగిపోయాయి. వైసీపీలోనే ఆపార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేరంటూ చిత్రీకరించే యత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో సుబ్బారావు వైఖరిని సహించలేని కొందరు ఒంగోలు నాయకులు నేరుగా దాడికి పాల్పడడం, ఆ వీడియోలు కూడా విస్తృతంగా ప్రచారం కావడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
ఇదంతా జరిగిన ఒకటి రెండు రోజులకే మంత్రి బాలినేని సమక్షంలో జరిగిన కార్యక్రమానికి హాజరుకావడంతో కథ సుఖాంతమయ్యిందని భావించారు. కానీ సుబ్బారావు స్కెచ్ వేరుగా ఉన్నట్టు ఆ తర్వాత బయటపడింది. బాలినేని భరోసాతో సంతృప్తి చెందానని చెప్పిన సుబ్బారావు ఆ తర్వాత మాట మార్చారు. బెజవాడలో ప్రెస్ మీట్ నుంచి ఢిల్లీలో హంగామా వరకూ కథ సాగింది. వైఎస్సార్సీపీ అండతో గెలిచి, ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించిన రఘురామకృష్ణంరాజు అండదండలతో హస్తినలో సుబ్బారావు ప్రచార కార్యక్రమానికి పూనుకున్నారు. తనకు ప్రాణ హాని ఉందంటూ కొత్తరాగం అందుకున్నారు. పైగా అతడిని కాపాడాలని రఘురామకృష్ణంరాజు కోరడం కూడా విశేషంగా కనిపిస్తోంది.
ఇదంతా ఓ పథకం ప్రకారం సాగుతున్న డ్రామాగా పలువురు సందేహించడానికి ఈ పరిణామాలు దోహదపడుతున్నాయి. తొలుత తానే విమర్శలు చేయడం నుంచి ఇప్పుడు ఒంగోలు నుంచి ఏకంగా హస్తిన వరకూ వెళ్ళి అమిత్ షాని కలుస్తానని అనడం ఆసక్తిగా ఉన్నప్పటికీ దాని వెనుక అసలు సూత్రధారులు వేరు అనే విషయాన్ని చాటుతోంది. ఏమయినా రాజకీయంగా ఇలాంటి వ్యవహారాలు పెద్ద విశేషం కాకపోయినా తాజాగా సుబ్బారావు గుప్తాని పావుగా చేసుకున్న వైనం ప్రస్ఫుటమవుతోంది. ఇలాంటి కుయుక్తులు గడిచిన మూడేళ్లుగా ఎన్నో వేసినా పారలేదు. ఇప్పుడు ఈ వ్యవహారంతో బాబు అండ్ బ్యాచ్ ఏంసాధిస్తుందో చూడాలి మరి.
Also Read : సుబ్బారావు గుప్తా పేరుతో ఆంధ్రజ్యోతి మరో కొత్త డ్రామా