iDreamPost
android-app
ios-app

సరిహద్దు గ్రామాలపై ఒరిస్సా జగడం!!!

సరిహద్దు గ్రామాలపై ఒరిస్సా జగడం!!!

సరిహద్దు గ్రామాలు అనగానే ఇదేదో హిమాచల్ ప్రదేశ్ లో చైనా దరిదాపుల్లో ఉన్న ఊళ్లని అనుకోకండి.. పాకిస్తాన్ బోర్డర్లోని కాస్మిర్ పల్లెలు కూడా కాపు. ఇటు బంగ్లా బోర్డర్ పల్లెలూ కావండి…. ఇవి పూర్తిగా ఆంధ్రా ఆధీనంలోని పల్లెలు.. కాకుంటే ఇవి ఒరిస్సాకు ఆనుకుని ఆ జిల్లా కేంద్రం అయినా కొరాపుట్ కు 100కిలోమీటర్ల దూరంలోను, విజయన గరం పట్టణానికి కూడా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోను, సాలూరుకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కొండ పై ఉంటాయి.

పాగులు చెన్నూరు, పట్టుచెన్నూరు, గంజాయి భద్ర, కొటియా గ్రామాలు ఇలా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో సమస్యల నడుమ, కొండల్లో కొలువై ఉంటున్నాయి. ఒరిస్సాలోని పాట్టంగి నియోజకవర్గానికి, ఆంధ్రాలోని సాలూరు ని యోజకవర్గానికి మధ్యలో ఉన్న ఈ రెండు పంచాయతీల్లో దాదాపు 22 చిన్న చిన్న గిరిజన గ్రామాలున్నాయి. వాస్తవాని 1950లో ఆంధ్రా ఒరిస్సా రాష్ట్రాలను విభజించినపుడు ఈ పల్లెలను ఎటూ కేటాయించకుండా వదిలేరారు. దీంతో అప్పటి నుంచీ ఆ గ్రామాలు అటు పూర్తిగా ఒడిశాకు, ఇటు ఆంధ్రాకు చెందకుండా నడి సముద్రంలోని నావలా ఉండిపోయాయి.

అక్కడికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం ఉండదు. ఆ గ్రామాల్లోని ప్రజలు అటు ఒరియాను, ఇటు తెలుగును సైతం మాట్లాడుతుంటారు. అయితే ఆ భౌగోళిక ప్రాంతం మాదంటే మాదని అటు ఒడిశా, ఇటు ఆంధ్రా అధికారులు క్లైయిమ్ చేసుకుంటుంటారు.తమ ఆధిపత్వాన్ని చూపడానికన్నట్లుగా స్కూల్ ళ్లు , రేషన్ షాపులు, అంగన్ వాడీ కేంద్రాల వంటివి రెండు రాష్ట్రా లూ అక్కడ ఏర్పాటు చేస్తుంటాయి. కొందరు గ్రామస్తులకు అయితే రెండు రాష్ట్రాల గుర్తింపు పత్రాలు, రెండు రాష్ట్రా ల ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉంటాయి. వీరికి ఏ అవసరం వచ్చినా సాలూరు వచ్చి తమ పనులు పూర్తి చేసుకుంటారు.

ఇన్నాళ్లూ ఈ పల్లెలను పెద్దగా పట్టించుకోని ఒడిశా ఇప్పుడిప్పుడే వీటిపై దృష్టి పెడుతోంది. వాస్తవానికి అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా విజయనగరం జిల్లా అధికార యంత్రాంగమే అప్రమత్తమై అక్కడికి చేరుతుంది. ప్రజల అవసరాలను తీరుస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆ పల్లెలకు చేరుకుని పలు ఆ భివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు రూపొందించారు.

ఆ మరుసటిరోజే కొరాపుట్ కలెక్టర్ సుదర్శన్ చక్రవర్తి, పొట్టంగి ఎమ్మెల్యే ప్రఫుల్ కుమార్ తదితరులు ఆ గ్రామాలకు హుటాహుటిన వెళ్లి ఆ భౌగోళిక ప్రాతంమంతా తమదేన ని ప్రకటించారు. అక్కడ ఆంధ్రా అధికారులు ఎలాంటి పనులు చేపట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదిలా పాగంతుండగానే అక్కడ పంచాయతీ ఎన్నికలు సైతం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. 2013లోను, ఆ తరువాత సైతం అక్కడ ఎన్నికలు జరిగాయి. అన్ని అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు

సుప్రీంలో ఒరిస్సా పిటిషన్

అయితే ఆంధ్రాలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలకు ముందే ఒరిస్సా సర్కారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.అవన్నీ తమ గ్రామాలని, వాటిలో ఆంధ్రా అధికారుల పెత్తనం ఏమిటి? అక్కడ ఆంధ్రా సర్కారు ఎన్నికలు జరపడం ఏమిటన్నది ఒరిస్సా వాదన. అక్కడ ఎన్నికలను నిలువరించాలని ఒరిస్సా కోరింది. దీనికి ప్రతిగా విజయనగరం కలెక్టర్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 1952 నుంచీ తామే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. జనాభా లిస్టులో సైతం అక్కడి ప్రజలంతా అంధ్రావారిగానే నమోదయ్యారని వివరించారు. ఇదే విషయమై ఒడిశా 2006లో సుప్రీం కోర్టులో కేసువేసి వీగిపోయిందని కూడా కలెక్టర్ గుర్తు చేశారు. కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రజల బాగోగులు తామే చూస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేపడుతున్నామని వివరిస్తూ వాటికి సంబంధించిన పత్రాల ఫాటోలు విడుదల చేశారు. మొత్తానికి అడవుల్లోని ఈ పల్లెలు రెండు రాష్ట్రాలకూ మధ్య నిరంతర వివాదానికి కార మవుతున్నాయి.