iDreamPost
android-app
ios-app

IND vs BAN: రోహిత్, కోహ్లీ కాదు.. మ్యాచ్ గెలిపించింది వాళ్లే!

  • Author singhj Updated - 08:34 AM, Fri - 20 October 23

వరుసగా మూడు విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న రోహిత్ సేన.. ఇవాళ బంగ్లాదేశ్​తో జరిగిన నాలుగో మ్యాచ్​లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది

వరుసగా మూడు విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న రోహిత్ సేన.. ఇవాళ బంగ్లాదేశ్​తో జరిగిన నాలుగో మ్యాచ్​లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది

  • Author singhj Updated - 08:34 AM, Fri - 20 October 23
IND vs BAN: రోహిత్, కోహ్లీ కాదు.. మ్యాచ్ గెలిపించింది వాళ్లే!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. వరుసగా మూడు విజయాలతో ఫుల్ జోష్​లో ఉన్న రోహిత్ సేన.. ఇవాళ బంగ్లాదేశ్​తో జరిగిన నాలుగో మ్యాచ్​లోనూ నెగ్గింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్ (66)తో పాటు ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా (46) రాణించారు. ఆరంభంలో తంజిద్, ఆఖర్లో మహ్మదుల్లా తమ బ్యాట్లకు పని చెప్పడంతో బంగ్లా ఫైటింగ్ స్కోరును భారత్ ముందు ఉంచింది.

టీమిండియా బౌలర్లలో పేసర్లు బుమ్రా, సిరాజ్​కు చెరో రెండు వికెట్లు దక్కాయి. స్పిన్నర్లలో జడేజా ఇద్దర్ని ఔట్ చేశాడు. కుల్దీప్, శార్దూల్​కు తలో వికెట్ దక్కింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన భారత్​కు కెప్టెన్ రోహిత్ శర్మ (48), శుబ్​మన్ గిల్ (53) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హిట్​మ్యాన్ అయితే బౌండరీలు, సిక్సులతో బంగ్లా బౌలర్లను బెదరగొట్టాడు. వీళ్లిద్దరూ కలసి ఫస్ట్ వికెట్​కు 88 రన్స్ జోడించారు. వరుసగా బౌండరీలు కొడుతూ జోరు మీదున్న రోహిత్.. మరో భారీ షాట్​ కొట్టే క్రమంలో క్యాచ్ ఔటై పెవిలియన్​కు చేరాడు.

హిట్​మ్యాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చాడు స్టార్ బ్యాటర్ కోహ్లీ. గిల్​-విరాట్ కలసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం గిల్ పెవిలియన్​కు చేరినా.. అయ్యర్ (19), కేఎల్ రాహుల్ (34 నాటౌట్) సాయంతో విరాట్ (103 నాటౌట్) భారత్​ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ తన స్టైల్​లో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. బ్యాటింగ్​లో రోహిత్, కోహ్లీ అదరగొట్టినా.. ఈ మ్యాచ్​ గెలిపించడం వెనుక బౌలర్ల కృషి ఎంతగానో ఉంది. బ్యాటింగ్​కు సహకరిస్తున్న పిచ్​పై మొదట్లో బంగ్లా బ్యాటర్లు బాగా ఆడారు.

బంగ్లా బ్యాట్స్​మెన్ ఈజీగా రన్స్ చేస్తున్న టైమ్​లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, శార్దూల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 256కే కట్టడి చేశారు. కాబట్టి సక్సెస్ క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఈ మ్యాచ్​లోనే కాదు ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ మ్యాచుల్లోనూ మంచి పార్ట్​నర్​షిప్ నెలకొని మ్యాచ్ చేజారుతున్న టైమ్​లో వెంట వెంటనే వికెట్లు తీశారు భారత బౌలర్లు. మెగా టోర్నీలో ఇతర జట్లకు భారత్​కు కనిపిస్తున్న ప్రధాన తేడా బౌలింగ్ అనే చెప్పాలి. బ్యాటింగ్​కు తోడుగా బౌలింగ్ కూడా ఆయుధంగా మారడంతో కప్పు వేటలో రోహిత్ సేన వడివడిగా దూసుకెళ్తోంది. మరి.. భారత్ వరుసగా నాలుగో విక్టరీని అకౌంట్​లో వేసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: PAKకి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి? భారత మాజీ ప్లేయర్