iDreamPost

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో స్టాఫ్ నర్సు పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలో స్టాఫ్ నర్సు పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. మెడికల్ కాలేజీల్లో 434 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు మంచి అవకాశం లభించినట్లైంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా, అక్టోబర్ 5 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? ఆ వివరాలు మీకోసం..

ప్రజారోగ్యంపై దృష్టిపెట్టిన ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం, అవసరమైన సిబ్బందిని నియమించడం వంటి చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఏపీలో కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో 434 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైటన్ https://cfw.ap.nic.in/ ను సందర్శించాలని అధికారులు కోరారు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టులు: స్టాఫ్ నర్స్

ఖాళీలు: 434 పోస్టులు

జోన్ వారీగా ఖాళీలు: జోన్ I- 86, జోన్ II- 220, జోన్ III- 34, జోన్ IV – 94.

అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 42 సంవత్సరాలు.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

అప్లికేషన్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులకు రూ.300.

అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత జోన్‌లోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 21, 2023

అప్లికేషన్ చివరి తేదీ: అక్టోబర్‌ 5, 2023

అధికారిక వెబ్‌సైట్‌ : https://cfw.ap.nic.in/

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి