Idream media
Idream media
ఎల్జీ అంశంపై బదనాం చేద్దామన్న ఆశలు గల్లంతు
ప్రభుత్వం ఏ అంశం మీద, ఎక్కడ దొరుకుతుందా దాన్ని సొంత మీడియా ద్వారా జగన్ను బదనాం చేసి సొంత మైలేజీ పెంచుకుందామా అని గోతికాడ నక్క మాదిరిగా ఎదురు చూస్తున్న తెలుగుదేశం ఆశలు ఎక్కడా నెరవేరడం లేదు. ఎక్కడికక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ టిడిపిని నోరు మెదపకుండా చేయడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాటుదేలారు.
గత మే 7న విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో స్టైరిన్ గ్యాస్ లీకై 14 మంది మరణించగా ఇంకో 400 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఇది దేశవ్యాప్తచర్చకు దారి తీసింది. నిపుణులు మేధావులు దీనిపై చర్చ ప్రారంభించారు. అయితే దీన్ని రాజకీయంగా వాడుకుందామని చూసిన టిడిపి కూడా దాన్ని మరింత రాజేయలని ప్రయత్నించింది. ప్రమాదం జరిగిన మరుక్షణం నుంచే తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది.
వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కు అయిందని అందుకే అరెస్టులు లేవని టిడిపి, దానికి వంత పాడే మీడియా ప్రచారం మొదలు పెట్టింది.
ప్రభుత్వం యాజమాన్యానికి కొమ్ము కాస్తోందని చెప్పి నిప్పు రాజేశారు.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ విశాఖ రావడం, అక్కడికక్కడే కోటి రూపాయల భారీ నష్టపరిహారం ఒక్కొక్క బాధిత కుటుంబానికీ ప్రకటించడం జరిగాయి. ప్రభావిత ప్రాంతంలోని ప్రతి వ్యక్తికి పదివేల సాయం అందించడమే కాకుండా కంపెనీ ఉన్న వెంకటపురంలో ఓ మెడికల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.
ఆ తరువాత నీరబ్ కుమార్ సారధ్యంలో ఓ హై పవర్ కమిటీని వేసి ప్రమాద కారణాలను అన్వేషించాలని కోరారు. ఈ మేరకు ఆ కమిటీ పలు కోణాల్లో దర్యాప్తు చేసి సంస్థ యజమాన్యానిదే తప్పని, నిర్వహణలో లోపాలు, మానవ తప్పిదాలే ప్రమాదానికి కారణం అని తేలుస్తూ 4000 పేజీల నివేదికను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది. నివేదిక వచ్చిన మరుసటిరోజే
ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి చెందిన కీలక బాధ్యులు డైరెక్టర్లు ఇంకా 11 మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఇక జనవాసాల్లో ప్రమాదకర పరిశ్రమలు ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ అంశాన్ని రచ్చ చేయాలని ఆశించిన టిడిపి దాని అనుకూల మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలకు నిరాశ ఎదురైంది. ఏదో ఒక అంశం మీద జగన్ ప్రభుత్వం మీద దుమ్ము పోయాలని చూసిన వారి కళ్ళలో దుమ్ము పడినట్లయింది. ఇక ఎవరూ దీనిమీద మాట్లాడే ధైర్యం చేయడం లేదు..అందరి నోళ్ళూ మూతబడ్డాయి.