iDreamPost
android-app
ios-app

Son Of India : మోహన్ బాబు సినిమాకు ప్రమోషన్ ఎప్పుడు

  • Published Feb 03, 2022 | 4:12 PM Updated Updated Feb 03, 2022 | 4:12 PM
Son Of India : మోహన్ బాబు సినిమాకు ప్రమోషన్ ఎప్పుడు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రూపొందిన సన్ అఫ్ ఇండియా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ మేరకు నిన్నో పోస్టర్ వదిలారు. దాని లాంచింగ్ ఈవెంట్ కూడా జరిగినట్టు లేదు. ఎక్కడా ఫోటోలు కనిపించలేదు. బుర్రకథతో దర్శకుడిగా డెబ్యూ చేసిన డైమండ్ రత్నబాబుకి ఇది రెండో సినిమా. నెలల క్రితమే టీజర్ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి హడావిడి లేదు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం, శ్రీకాంత్ మీనా లాంటి సీనియర్ క్యాస్టింగ్, మంచు విష్ణు ప్రొడక్షన్ లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నప్పటికీ ఎందుకో ఈ సన్ అఫ్ ఇండియా ఆశించిన బజ్ ని తేలేకపోతోంది. సోషల్ మీడియాలోనూ పెద్దగా స్పందన లేదు. ఇలా ఉంటే ఇబ్బందే.

ఎందుకంటే ఈ చిత్రం వస్తున్న 18వ తేదీన ఖిలాడీ వచ్చే అవకాశం ఉంది. ఆపై కేవలం వారం గ్యాప్ లోనే ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ లాంటి క్రేజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఒకవేళ భీమ్లా నాయక్ కనక 25కి ఫిక్స్ అయితే ఇవన్నీ తప్పుకుంటాయి. ఏది జరిగినా సన్ అఫ్ ఇండియా రన్ రిస్క్ లో పడుతుంది. మోహన్ బాబుకి వ్యక్తిగతంగా ఇప్పుడు పెద్ద మార్కెట్ లేదు. గాయత్రిని అంత ఖర్చు పెట్టి తీసినా ఫలితం దక్కలేదు. ఈ సన్ అఫ్ ఇండియాని రీజనబుల్ బడ్జెట్ లోనే తీశారని టాక్ ఉంది కానీ అది ఎంత మొత్తమైనా సరే రికవరీ కావాలంటే ప్రమోషన్లు చాలా కీలకం. సన్ అఫ్ ఇండియా మిస్ చేస్తోంది ఇదే.

ఇంకో వారం పది రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని అంటున్నారు కానీ డేట్ ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సన్ అఫ్ ఇండియా జనవరి చివరి రెండు వారాల్లోనూ లేదా రేపు ఫిబ్రవరి 4నో వచ్చి ఉంటే మంచి ఫలితం దక్కేది. ఎందుకంటే చెప్పుకోదగ్గ పెద్ద రిలీజ్ ఏదీ ఈ డేట్లలో రాలేదు. టికెట్ కౌంటర్లు చప్పగా ఉండిపోయాయి. అలాంటప్పుడు సన్ అఫ్ ఇండియా పర్లేదు అనే టాక్ వచ్చినా చాలు ఈజీగా గట్టేక్కేది. ఒకవేళ ఖిలాడీ కనక 18 కాకుండా 11నే వచ్చేస్తే ఓ వారం సేఫ్ రన్ దక్కుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. పబ్లిసిటీ చేస్తేనే జనం సినిమాలను గుర్తించడం లేదు. అలాంటిది ఎక్కువ మౌనంగా ఉండటం కూడా కరెక్ట్ కాదు.

Also Read : T- Series : టి సిరీస్ – కొత్త ఫీల్డ్ లో గ్రాండ్ ఎంట్రీ