iDreamPost
iDreamPost
ఇంకో రెండు రోజుల్లో రజనీకాంత్ దర్బార్ విడుదల కానుంది. తమిళనాట ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటిసారి మురుగదాస్ తలైవా కాంబినేషన్ మూవీ కావడంతో అభిమానులు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నత్త నడకతో కొనసాగుతున్నాయి.
ఖచ్చితంగా చెప్పాలంటే రజని కొట్టిన ఆఖరి గట్టి హిట్టు రోబోనే. అందుకే క్రమంగా రజని సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దర్బార్ మీద హైప్ లేకవడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు బాషా, నరసింహ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ తో మన స్టార్లు సైతం భయపడే మార్కెట్ సృష్టించుకున్న ఈ సూపర్ స్టార్ మళ్ళి పునఃవైభవం దర్బార్ తో అయినా సాధించాలని ఫ్యాన్స్ కోరిక. గురువారంతో ఇది నిజమవుతోందో లేదో తేలిపోతుంది.