iDreamPost
android-app
ios-app

చంద్ర‌బాబు సార్‌, మీరు మ‌ట‌న్ అమ్మ‌లేదా?

చంద్ర‌బాబు సార్‌, మీరు మ‌ట‌న్ అమ్మ‌లేదా?

ప్ర‌భుత్వం మ‌ట‌న్ మార్ట్‌లు న‌డుపుతుంది అన‌గానే తెలుగుదేశం విమ‌ర్శ‌లు, సెటైర్లు, ట్రోలింగ్స్ ప్రారంభించింది. గ‌వ‌ర్న‌మెంట్ మ‌ట‌న్ అమ్మ‌డ‌మా! జ‌గ‌న్ ఇచ్చే ఉద్యోగాలు ఇవేనా అని స్టార్ట్ చేశారు. గ‌తం గుర్తు లేక‌పోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల ల‌క్ష‌ణం. చంద్ర‌బాబుకి ఈ ల‌క్ష‌ణాలు మ‌రీ ఎక్కువ‌.

గ‌తంలో ఆయ‌న ప‌నిచేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోనూ, NTR అల్లుడుగా చ‌క్రం తిప్పిన TDP గ‌వ‌ర్న‌మెంట్‌లో గుడ్లు, చికెన్‌, మ‌ట‌న్ ప్ర‌భుత్వ ఉద్యోగులే అమ్మిన విష‌యం ఒక‌సారి గుర్తు చేసుకుందాం.

1977 నాటికి కోళ్ల ఫారాలు అతి త‌క్కువ వుండేవి. చికెన్ తినాలంటే నాటుకోళ్లే గ‌తి. అనంత‌పురంలో ఆదివారం ఉద‌యం ట‌వ‌ర్‌క్లాక్ ద‌గ్గ‌ర దొరికేవి. చాలా ఖ‌రీదు. సామాన్యులు కొన‌లేని ప‌రిస్థితి. 78లో ప‌శువుల ఆస్ప‌త్రిలో చికెన్ అమ్మ‌కాలు ప్రారంభించారు. అదీ వారంలో ఒక‌రోజే.

Also Read : మటన్ దుకాణాల్లో మళ్లీ బోల్తా పడిన టీడీపీ

ఆదివారం ఉద‌యాన్నే టోక‌న్ తీసుకుంటే, క‌నీసం రెండు గంట‌లు Wait చేస్తే ఐస్‌లో వున్న కోళ్లు క‌ట్‌చేసి ఇచ్చేవాళ్లు. 1980 త‌ర్వాత ప్ర‌యివేట్ షాప్‌లు పెరిగి, చికెన్ అందుబాటులోకి వ‌చ్చింది.

జ‌నంలో గుడ్లు, చికెన్ , మాంసం తినే అల‌వాటుని పెంచాల‌నే మంచి ఉద్దేశంతో ప్ర‌భుత్వ‌మే పౌల్ట్రీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది. 1991 వ‌ర‌కూ ఇవి న‌డిచిన‌ట్టు గుర్తు. తిరుప‌తిలో మంచినీళ్ల గుంట స‌మీపంలో కార్పొరేష‌న్ ఆఫీస్ వుండేది. చికెన్‌, గుడ్లు ప్ర‌తిరోజూ అమ్మేవాళ్లు. మాంసం మాత్రం ప్ర‌తి ఆదివారం దొరికేది. నాణ్య‌త వుండ‌డంతో డిమాండ్ ఎక్కువ వుండేది. టోకెన్లు ఇచ్చేవాళ్లు. త‌రువాత రోజుల్లో పోటీ పెర‌గ‌డం , నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్ల ఇవి మూత‌ప‌డ్డాయి. కార్పొరేష‌న్ కూడా ర‌ద్దు లేదా విలీనం అయిన‌ట్టు గుర్తు.

Also Read: తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

వాస్త‌వానికి ఆరోగ్య‌క‌ర‌మైన మాంసం అమ్ముతున్న‌ట్టు మునిసిపాలిటీ వాళ్లు సీల్ వేసి ఓకే చేయాలి. మ‌న‌వాళ్లు డ‌బ్బులిస్తే కుక్క‌ని కూడా గొర్రె అని స‌ర్టిఫై చేస్తారు. శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్లు ప‌ని చేయ‌రు, వాళ్ల‌ని ప‌ని చేయ‌నీయ‌రు.

ఈ 30 ఏళ్ల‌లో మాంసం వినియోగం పెరిగింది. న‌గ‌రాల్లో ఇప్ప‌టికే మాంసం మార్ట్‌లున్నాయి. షాప్ ధ‌ర కంటే ఇక్క‌డ చాలా కాస్ట్‌లీ. ఇలాంటి ప్ర‌తిపాద‌న లేద‌ని మంత్రి అంటున్నారు. ఒక‌వేళ మంచి క్వాలిటీ వున్న మాంసాన్ని ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో అమ్మితే ప్ర‌జ‌ల‌కు మేలే క‌దా! దీంట్లో కోట్ల రూపాయ‌లు లాభాలేమి రావు. అంద‌రికీ తెలుసు. స‌క్సెస్ అయితే వేల మందికి ఉపాధి వ‌స్తుంది. ప్ర‌యివేట్ కంపెనీల దోపిడీ త‌గ్గుతుంది. మొగ్గ ద‌శ‌లోనే దుమ్మెత్తడం దేనికి!

మ‌ట‌న్ మార్ట్‌ల‌ని వ్యాపారంగా కాకుండా సౌక‌ర్యంగా చూస్తే అన్ని పాజిటివ్‌గా క‌న‌బ‌డ‌తాయి.

Also Read: ఆ మాజీ ఎమ్మెల్యే వయస్సు 104 ఏళ్ళు,పింఛన్ కూడా తీసుకోడు