Idream media
Idream media
దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార ఎన్డీయే నుండి మిత్రపక్షాలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. మోడీ హయాంలో 16 పార్టీలు ఎన్డీయేను వదిలి వెళ్లిపోగా ఉన్న మిత్రపక్షాలు కూడా విడిపోతామంటూ బెదిరిస్తున్నాయి. శిరోమణి ఆకాలీదల్, శివసేన,టీడీపీ,పీడీపీ వంటి పెద్ద ప్రాంతీయ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు ఎన్డీయేతో దోస్తిని తెంచుకున్నాయి.కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలు వీడడం బీజేపీని సందిగ్ధంలో పడేసాయి.
తాజగా బిహార్లో అధికార జేడీయూ కూడా బీజేపీతో దోస్తీ వదులుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 74 సీట్లు గెలిచినప్పటికి 43 సీట్లు గెలిచిన జేడీయూకు ముఖ్యమంత్రి పదవీ వదిలిపెట్టింది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న నితీష్ కుమార్ ఈమధ్య వ్యాఖ్యలు బీజేపీతో దోస్తిని వదులుకోవడానికి సిద్ధం అన్నట్లుగా ఉన్నాయి. కులగణన విషయంలో నితీష్ కుమార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ ను కలిసాడు .ప్రతిపక్ష నేతను కలవడంతో బీహార్ అధికార కూటమి జేడీయూ-బీజేపీ మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం హర్యానా మాజీ ముఖ్యమంత్రి హోం ప్రకాష్ చౌతాలతో కూడా నితీష్ కుమార్ సమావేశం అయ్యారు. కానీ చౌతాలతో భేటీలో రాజకీయాంశాలు చర్చలకు రాలేదని చెప్తున్నప్పటికి నితీష్ ప్రయత్నాలు మోడీకి వ్యతిరేకంగానే పడుతున్నాయి.
తాజగా వచ్చే ఏడాది యూపీ, మణిపూర్ లో జరిగే ఎన్నికలలో బీజేపీతో పొత్తు కుదరక పోతే బీజేపీపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీహార్ సీఎం నితిష్ కుమార్ తో పాటు జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. ఇక్కడ ఇంట్రస్ట్ విషయం ఏంటంటే మొన్నటి మోడీ క్యాబినెట్ విస్తారణలో జేడీయూ ఎంపీ ఆర్సీపీ సింగ్ కు మంత్రి పదవి కూడా దక్కింది.
పెగాసిస్ పై విచారణకు నితీష్ డిమాండ్..
పెగాసిస్ వ్యవహారంలో విచారణ జరపాలిసిందే అని నితీష్ కుమార్ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. విచారణతో పాటు పార్లమెంట్ లో చర్చ జరపాలని వాయిస్ పెంచడంతో బీజేపీ ఆశ్చర్యానికి గురైంది. మిత్ర పక్షం అయి ఉండి కూడా పెగాసిస్ విషయంలో ప్రతిపక్షాల డిమాండ్ కు నితీష్ మద్దతు తెలిపినట్టయింది. దీనిపై బీజేపీ నేతలెవరు స్పందించనప్పటికి నితీష్ మీద బీజేపీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితుల ప్రభావంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాగలిగారు అని వ్యాఖ్యలు చేసినా బీజేపీ ఎమ్మెల్సీ తున్నా పాండేను బీజేపీ బహిష్కరించినప్పటికి బీజేపీ,జేడీయూ మధ్య విభేదాలు నీవురుగప్పిన నిప్పుల ముదురుతున్నాయని అర్థం అవుతుంది.
తాజగా బిఎస్పీ అధినేత మాయావతి కూడా కుల గణన చేయాలని చూస్తే మోడీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది. వచ్చే యూపీ ఎన్నికల్లో కులగణన ప్రధాన అంశంగాగా మారే అవకాశం ఉంది.ఇదే అంశం మీద యూపీ ఎన్నికల్లో కొత్త పొత్తులు ఏర్పడే అవకాశం ఉంది. మోడీకి వ్యతిరేకంగా ఏర్పడ బోతున్న కుటమిలోకి నితీష్ కుమార్ వెళ్తడా అన్నది కొంత సంశయించాలిసిన విషయమే. కానీ 40 లోక్ సభ స్థానాలున్న బీహార్ లో జేడీయూతో బీజేపీకి ఉన్న మిత్రుత్వాన్ని తెంచుకునే ప్రయత్నం బీజేపీ చేయకపోవచ్చు. కానీ నితీష్ చర్యలు నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ నాయకత్వం సరైన సమయంలో స్పందించవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అంటారు కదా. నితీష్ మమతతో కలిసిన ఆశ్చర్య పోవాలిసిన అవసరం లేదు.