iDreamPost
android-app
ios-app

నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. అదే జరిగితే లీటర్‌ పెట్రోల్‌ రూ.15కే!

  • Published Jul 05, 2023 | 6:02 PM Updated Updated Jul 05, 2023 | 6:02 PM
  • Published Jul 05, 2023 | 6:02 PMUpdated Jul 05, 2023 | 6:02 PM
నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. అదే జరిగితే లీటర్‌ పెట్రోల్‌ రూ.15కే!

మార్కెట్‌లో ప్రతి వాటి ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా.. వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక ఇంధన ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వాహనాలు ఫుల్‌ ట్యాంక్‌ చేయించి ఎన్ని ఏళ్లవుతుందో. రూ. 100 ఖర్చు చేసినా సరే.. లీటర్‌ పెట్రోల్‌ రావడం లేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.110గా ఉంది. ఇక డీజిల్‌ ధర కూడా అలానే ఉంది. లీటరు డీజిల్ కొనాలంటే రూ. 100 నోటు ఇవ్వాల్సిందే. ఇంధన ధరలు సెంచరీ దాటి చాలా కాలమే అవుతోంది. ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఏదో కంటి తుడుపు చర్యగా నాలుగైదు రూపాయలు తగ్గిస్తాయి. ఎన్నికలు అయ్యాక.. మళ్లీ ఎప్పటిలానే ధరలు పెంచుతాయి.

ఇంధన ధరలు పెరిగితే.. దాని ప్రభావం చాలా వాటి మీద పడుతుంది. కరోనా తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గినా.. మన దేశంలో మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పెట్రోల్ డీజిల్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిస్థితుల్లో మార్పు వస్తే.. దేశంలో కేవలం రూ.15కే లీటర్‌ పెట్రోల్‌ దొరుకుతుంది అన్నారు. ఆ వివరాలు..

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న నితిన్ గడర్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దేశంలోని అన్ని వాహనాలు రైతులు ఉత్పత్తి చేస్తున్న ఇథనాల్‌ ఇంధనంతో నడుస్తాయని అన్నారు. అదే జరిగిన రోజున మన దేశంలో ఉండే వాహనాల్లో 60 శాతం ఇథనాల్‌తో నడిస్తే.. మరో 40 శాతం ఎలక్ట్రిసిటీ ఆధారంగా పని చేస్తాయని.. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం చాలా వరకు తగ్గుతుంది అన్నారు. అప్పుడు మన దేశంలో లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.15కే లభిస్తుందని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అలానే కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు.

ఇంధన వాడకం తగ్గితే.. దిగుమతుల భారం కూడా దిగి వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం మన దేశ దిగుమతుల భారం రూ. 16 లక్షల కోట్లుగా ఉందని.. తాను అనుకున్నట్లు.. దేశంలో ఇథనాల్‌, ఎలక్ట్రిసిటీ ఆధారంగా పని చేసే వాహనాల సంఖ్య పెరిగితే.. ఇది సాధ్యామవుతుందని.. అప్పుడు ఈ మొత్తం రైతులకు చేరుతుందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. వారిని అన్నదాతలుగా, ఉర్జాదాతలుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కాగా ఈయన ప్రతాప్‌గఢ్‌లో 11 నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటి విలువ రూ.5600 కోట్లు.