iDreamPost
iDreamPost
ప్రస్తుతం రంగ్ దే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి దాంతో పాటు తన పెళ్లి ఘడియల కోసం ఎదురు చూస్తున్న నితిన్ లాక్ డౌన్ పూర్తయ్యాక చాలా బిజీగా మారనున్నాడు. ముందది పూర్తి చేసి ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందే అందాదున్ రీమేక్ ని ఫినిష్ చేయాలి. ఆ వెంటనే చంద్రశేఖర్ యేలేటి తీయబోయే సినిమాకు జాయిన్ కావాలి. కానికి దీనికి టైం పడుతుందని ఇన్ సైడ్ టాక్. రౌడీ ఫెలో, చల్ మోహనరంగా ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ పవర్ పేటకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఇది రెండు భాగాలుగా రూపొందుతోందట.
తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో నితిన్ మూడు వయసులున్న పాత్రలో కనిపిస్తాడు. అంటే ట్రిపుల్ రోల్ కాదు. టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఇలా కథ ప్రకారం టైం ట్రావెల్ చేయిస్తూ ఒక బయోపిక్ లాగా దీన్ని రూపొందిస్తారట. అలా అని ఇదేమి రియల్ స్టొరీ కాదు. కమర్షియల్ ఎంటర్ టైనరే. కాకపోతే కమల్ హాసన్ నాయకుడు తరహాలో మూడు షేడ్స్ ఉంటాయన్న మాట. పవర్ పేట అనే ప్రాంతంలో ఒక యువకుడు ఎవరూ ఊహించని స్థాయికి ఊరిని, రాష్ట్రాన్ని ఏలే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ మీద చాలా డిఫరెంట్ గా దీన్ని తీర్చిదిద్దబోతున్నారట. ఆ ప్రయాణంలో జరిగే సంఘటనల సమూహారమే పవర్ పేట.
నిజానికి లవర్ బాయ్ గానే ఎక్కువ సక్సెస్ ఉన్న నితిన్ ఇలా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేయడం రిస్కే. అందులోనూ ఈ వయసులో కమల్ హాసన్ తరహాలో ఇమేజ్ కి కట్టుబడకుండా 60 ఏళ్ళ వృద్ధుడిగా కనిపించేందుకు సిద్ధం కావడం విశేషం. ఈ మేకప్స్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి నిపుణులను పిలిచిపించబోతున్నారని సమాచారం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ ని పక్కాగా చేసుకుంటోంది యూనిట్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ మూవీలో మిగిలిన క్యాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్నారు. రంగ్ దే తిరిగి మొదలయ్యాక మిగిలిన సినిమాలను నితిన్ ఏ వరసలో ప్లాన్ చేసుకుంటాడు అనేదాన్ని బట్టి పవర్ పేట షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటాయి.