నిర్భయ దోషులకు నలుగురు నిందితులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది పటియాలా కోర్టు. నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలనీ ఢిల్లీ ప్రభుత్వం పటియాలా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన పటియాలా కోర్టు ఈ నెల 20 న ఉదయం 5.30 నిమిషాలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
గతంలో నిర్భయ నిందితులకు ఉరి ఖరారు చేస్తూ మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసినా, న్యాయవ్యవస్థలో ఉన్న సాంకేంతిక కారణాలను వినియోగించుకుంటూ, ఒకరితర్వాత ఒకరు క్యురేటివ్,రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. దీంతో ఉరి శిక్ష అమలులో జాప్యం చోటు చేసుకుంది. కాగా న్యాయపరమైన అన్ని అవకాశాలని నిందితులు పూర్తిగా వినియోగించుకోవడంతో మరోసారి ఢిల్లీ ప్రభుత్వం కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలనీ పటియాలా కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 20 న ఉదయం 5.30 నిమిషాలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు తుది తీర్పు జారీ చేసింది.
ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలను నిందితులు ఉపయోగించుకోవడంతో ఈ నెల 20 న దాదాపు ఉరిశిక్ష ఖరారు అయినట్లే అని నిందితులకు మరోసారి శిక్షను వాయిదా వేయించే అవకాశం లేదని న్యాయనిపుణులు వెల్లడిస్తున్నారు. తమని తాము గాయపరచుకుని శిక్ష అమలులో జాప్యం జరిగేలా చేసే అవకాశాలు ఉన్నందున నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య గమనించనున్నారని సమాచారం.