దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో తనకు పడిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ నిర్భయ అత్యాచార కేసులో నిందితుడు అయిన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టులో నేడు విచారణకు వచ్చింది. కాగా అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. కానీ రేపటి విచారణ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బాబ్డే తప్పుకోవడం సంచలనాన్ని కలిగిస్తుంది. అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్ ను తాను వినబోనని చీఫ్ జస్టిస్ అరవింద్ బాబ్డే స్పష్టం చేసారు.
గతంలో నిర్భయ తరపున చీఫ్ జస్టిస్ బాబ్డే కోడలు వాదనలు వినిపించారు. కోడలు వాదించిన కేసులో తీర్పును ఇవ్వలేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బాబ్డే తెలిపారు. రేపటి విచారణలో వేరొక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తానని చీఫ్ జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు.అక్షయ్ సింగ్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను రేపు సుప్రీం కోర్టులోని కొత్త బెంచ్ విననుంది. రేపటితో నిర్భయ దోషి అక్షయ్ సింగ్ భవితవ్యం తేలనుంది. గతంలో నిర్భయ నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ల ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ అక్షయ్ సింగ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తే, నిర్భయ దోషుల దాదాపుగా ఉరిశిక్ష ఖరారు అయినట్లే.