నిమ్మగడ్డ ప్రసాద్ తప్పులేదు – సెర్బియా సుప్రీం కోర్టు తీర్పు.

నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సెర్బియా పోలీసులు ఆయనను విడుదల చేశారు. దీంతో సుమారు 8 నెలలుగా సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఎట్టకేలకు హైద్రబాద్ చెరుకున్నారు. అయితే కరోనా వైరస్ ప్రపంచం అంతా తీవ్రంగా వ్యాపించిన నేపద్యంలో ఆయనను క్వారంటైన్ శిబిరానికి తరలించారు 14 రోజుల వైద్య పరీక్షల తరువాత వైరస్ రిజల్ట్ నెగిటివ్ రిపోర్ట్ తో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.

వివాదం నేపద్యం:-

ప్రకాశం జిల్లాలో సీపోర్టులు, ఎయిర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 11.3.2008న రాష్ట్ర ప్రభుత్వానికి – రస్ అల్ ఖైమా ప్రభుత్వానికి మధ్య జీ టూ జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) ఒప్పందం కుదిరి ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుకు రస్ అల్ ఖైమా తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్ సంస్థను చేర్చుకుంది. కారిడార్ కోసం వాన్‌పిక్ 28 వేల ఎకరాలు అడగగా . వైఎస్సార్ ప్రభుత్వం ప్రాజెక్టుకు 18వేల ఎకరాలు మాత్రమే ఇవ్వబోతునట్టు ఆనాడే స్పష్టం చెసింది. దీంతో రస్ అల్ ఖైమా సంస్థ ప్రభుత్వం కలిసి వై.యస్ మరణించే సమయానికి సుమారు 13వేల ఎకరాలు సేకరించగా అందులో 200 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి. మిగిలిన భూములను ఎకరాకు రూ. 1.2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య వెచ్చించి వాన్‌పిక్ సంస్థే కొనుగోలు చేసుకుంది. ఈ ప్రాజెక్టులో 26% వాటా ఉన్న రాక్‌ సంస్థ దాదాపు రూ.535 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.

వై.యస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపద్యంలో కేసులు వివాదాలతో ప్రాజెక్టు నిలిచిపోగా. ఈ ప్రాజెక్టుకోసం భారీగా పెట్టుబడులు పెట్టి రాక్‌ సంస్థ కొనుగోలు చేసిన భూములను సైతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దీంతో ప్రధాన భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ పెట్టుబడులు సైతం అందులో ఇరుక్కుపోయాయి. దీంతో తమ దేశ ప్రభుత్వాన్ని మోసం చేసి, వాన్ పిక్ భూముల అంశంలో తమను తప్పుదోవ పట్టించారని తమ పెట్టుబడులపై తగిన రాబడి రాలేదంటూ రాక్‌.. యూఏఈ కోర్టులో తమ భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ పై ఫిర్యాదు చేసి యూఏఈ కోర్టు నుంచి లుకౌట్‌ నోటీసులు పొందింది . దీంతో బెల్‌గ్రేడ్‌లో దిగిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను అక్కడి పోలీసులు గత ఏడాది జులైలో అదుపులోకి తీసుకున్నారు. నెలరోజుల అనంతరం సెర్బియా దాటి వెళ్ళకూడదు అనే ఆంక్షలతో విడుదల చేశారు.

Read Also :  రెండోసారి తిరుమల మూసివేత.. 128 ఏళ్ల కిందట మొదటి సారి..

అయితే సెర్బియా సుప్రీంకోర్టులో జరిగిన సుదీర్ఘ విచారణ తరువాత , వాన్‌పిక్‌ ప్రాజెక్టు న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న కారణంగా నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఇందులో ప్రసాద్‌ తప్పేమీ లేదనే అభిప్రాయాన్ని సెర్బియా కోర్ట్ వ్యక్తపరిచింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సెర్బియా పోలీసులు ఆయనను విడుదల చెయడంతో నెలల తరబడి నిర్బంధంలో మగ్గిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు.

Show comments