iDreamPost
android-app
ios-app

100 కోట్ల సంచలనం – కార్తికేయ 2

  • Published Aug 27, 2022 | 5:27 PM Updated Updated Dec 26, 2023 | 6:24 PM

థాంక్ యు కోసం ఒకసారి, మాచర్ల నియోజకవర్గం కోసం ఒక రోజు ఆలస్యంగా ఇలా ఏవో తిప్పలు పడి రిలీజైన కార్తికేయ 2 ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని అందుకుంది.

థాంక్ యు కోసం ఒకసారి, మాచర్ల నియోజకవర్గం కోసం ఒక రోజు ఆలస్యంగా ఇలా ఏవో తిప్పలు పడి రిలీజైన కార్తికేయ 2 ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని అందుకుంది.

100 కోట్ల సంచలనం – కార్తికేయ 2

విడుదలకు ముందు అష్టకష్టాలు పడింది. ఎవరెవరి సినిమాల కోసమో వాయిదా వేసుకుంది. థాంక్ యు కోసం ఒకసారి, మాచర్ల నియోజకవర్గం కోసం ఒక రోజు ఆలస్యంగా ఇలా ఏవో తిప్పలు పడి రిలీజైన కార్తికేయ 2 ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ సాధించే దిశగా పరుగులు పెట్టడం నిఖిల్ లాంటి చిన్న హీరోకు అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. అందులోనూ నార్త్ లో విపరీతమైన గుర్తింపు దక్కడం, లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లను తోసేసి మరీ విన్నర్ గా నిలవడం మాములు విషయమా. అరవై స్క్రీన్లతో మొదలుపెట్టి ఏడు వేలు దాటడం మాటలు కాదు. ఇది నిజంగా గొప్ప అచీవ్ మెంట్.
Karthikeya 2
నిన్న కర్నూలులో వంద కోట్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజానికి కార్తికేయ 2 ఆ మార్కుకు దగ్గరగా ఉంది కానీ ఇంకా చేరుకోలేదని ట్రేడ్ టాక్. నిన్నటిదాకా వచ్చిన వసూళ్ల వరకు చూసుకుంటే 86 కోట్ల దాకా గ్రాస్ అయ్యిందట. షేర్ లెక్కలో అది 44 కోట్ల దాకా తేలుతుంది. అయితే సెంచరీ ఫీట్ చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకే అంత కాన్ఫిడెన్స్ తో ఈవెంట్ చేశారు. నైజామ్ లో అత్యధికంగా 10 కోట్లకు పైగా రాబట్టిన కార్తికేయ 2 సీడెడ్ లోనూ 4 కోట్లకు పైగా వసూలు చేయడం గమనార్హం. అక్కడ కనీసం పాతిక కోట్ల మార్కెట్ ఉన్న హీరోలకే సాధ్యమయ్యే ఫీట్ ఇది. ఓవర్సీస్ లోనూ 5 కోట్లు వసూలయ్యాయి. హిందీ వెర్షన్ సోమవారానికి 11 కోట్లు దాటేస్తుంది.

ఎలా చూసుకున్నా నిఖిల్ లాంటి హీరోలకు ఇది కాన్ఫిడెన్స్ ఇచ్చే రికార్డు. కంటెంట్ ఉంటే చాలు స్టార్ పవర్ పనిచేయదని నిరూపిస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అటు నార్త్ లోనూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజులేవీ లేకపోవడంతో కార్తికేయ 2 ప్రభంజనం ఇంకో రెండు వారాలకు పైగానే సాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా లైగర్ డిజాస్టర్ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. చాలా చోట్ల తగ్గించిన స్క్రీన్లు తిరిగి నిఖిల్ కే వచ్చేస్తున్నాయి. హిందీలోనూ విజయ్ దేవరకొండ బొమ్మకు తిరస్కారం ఎదురయ్యింది. దీంతో కార్తికేయ 2 తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. మొత్తానికి సౌత్ డామినేషన్ ఈ స్థాయిలో ఉండబట్టే అక్కడి మేకర్స్ మన సినిమాలకు వణికిపోతున్నారు