మొదటిసారిగా “రైట్ టూ రిపేర్”..  ప్రపంచంలోనే కొత్త చట్టం అమలు

  • Updated - 11:24 PM, Sun - 5 June 22
మొదటిసారిగా “రైట్ టూ రిపేర్”..  ప్రపంచంలోనే కొత్త చట్టం అమలు

మన దేశంలో వినియోగదారుల హక్కులకు పెద్దగా ప్రాధాన్యత, అవగాహన లేదు కానీ, విదేశాల్లో మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ వినియోగదారలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా చట్టసభలు సైతం తీవ్రంగా స్పందిస్తాయి. ఇప్పుడూ న్యూయార్క్ లోనూ ఇదే జరిగింది.

ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతరత్రా విషయాల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం  తెచ్చేందుకు ముందడుగు వేసింది. మొట్టమొదటి సారిగా యావత్ ప్రపంచంలోనే ఫెయిర్ రిపేర్ యాక్ట్ ను అమలు చేసేందుకు సిద్ధపడింది.

వాస్తవానికి నేడు డిజిటల్ వస్తువుల్లో వచ్చే చిన్న చిన్న సమస్యల కోసం తయారీదారులు సూచించే నిర్దిష్ట కేంద్రాల్లోనే రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని పరిష్కరించేందుకు న్యూయార్క్ చట్టసభ సిద్ధమైంది.

డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఇకపై తమ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెచ్చే సమయంలో వాటి పరిష్కారాలను కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందని న్యూయార్క్‌ చట్టసభ నిర్ణయించింది. వస్తువుల మరమ్మతుల కోసం స్థానిక దుకాణాలను కూడా ఆశ్రయించేందుకు కార్యచరణ చేయాలని తెలిపింది. చేతిలో ఉన్న సమాచారంతో సొంత పరిష్కారాలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. న్యూయార్క్ చట్టసభ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇతర విడి భాగాల అమ్మకాలపై ఉన్న ఆంక్షలు, నిబంధనలు సైతం తొలిగిపోవడం విశేషం.

Show comments