iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ లిస్టులో మరో ఇద్దరు

  • Published Apr 19, 2021 | 8:37 AM Updated Updated Apr 19, 2021 | 8:37 AM
మెగాస్టార్ లిస్టులో మరో ఇద్దరు

ప్రస్తుతం ఆచార్యని పూర్తి చేయడంలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత వెంటనే లూసిఫర్ రీమేక్ లో జాయినైపోతారు.  కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటీ లేదు కానీ ఒకవేళ ఆలస్యమైనా మే లేదా జూన్ లో మొదలు కావడం పక్కా. దీనికి కింగ్ మేకర్, రారాజు, బైరెడ్డి  అని రెండు మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే చిరుతో సహా టీమ్ ఎవరూ వీటికి స్పందించడం లేదు. దీని తర్వాత బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే భారీ ప్రాజెక్ట్ ఉంది. దీన్ని కూడా ఈ ఏడాదే సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మెహర్ రమేష్ తో ప్లాన్ చేసుకున్న వేదాళం రీమేక్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఖచ్చితంగా ఉంటుందా లేక ఏదైనా కారణాల వల్ల వాయిదా వేశారా లాంటివేవి బయటికి చెప్పలేదు. వీటి సంగతలా ఉంచితే తాజాగా మరో రెండు కొత్త పేర్లు ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. అందులో మొదటిది మురుగదాస్. చిరంజీవి రాజకీయ ప్రవేశం దగ్గరలో ఉన్నప్పుడు ఈ ఇద్దరి కాంబోలో స్టాలిన్ వచ్చింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కాకపోతే హీరోయిజం ఎలివేట్ చేస్తూ దాస్ చిరంజీవిని చూపించిన తీరు అభిమానులకు బాగా నచ్చింది. అయితే దాస్ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగాలేదు.

విజయ్ సర్కార్ పర్వాలేదు అనిపించినా రజనీకాంత్ దర్బార్ నిరాశపరిచింది. మురుగదాస్ లో మునుపటి మేజిక్ మిస్ అయ్యిందని ఇప్పటికే చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ తో చేయాల్సిన ఇంకో సినిమా పెండింగ్ లో ఉంది. మరి చిరు రిస్క్ చేసి ఓకే అంటారా అనేది అనుమానమే. మరోవైపు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినా అనూహ్యంగా ఖాళీగా ఉండాల్సి వచ్చిన వంశీ పైడిపల్లి సైతం చిరంజీవి కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. చరణ్ తో ఎవడు డీల్ చేసిన విధానం నచ్చిన మెగాస్టార్ ఫుల్ స్క్రిప్ట్ అయ్యాక నిర్ణయం చెబుతానని అన్నారట. మరి ఈ ఇద్దరిలో ఎవరు జాక్ పాట్ కొట్టనున్నారో అసలింతకీ ఒకరికైనా లక్ తగులుతుందో లేదో చూడాలి