iDreamPost
iDreamPost
కరోనా రెండు వేవ్స్ అయిపోయాయి ఇక ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్న తరుణంలో కొత్తగా ఓమిక్రాన్ వెర్షన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఇండియాలో రెండు కేసులు నమోదయ్యాయని మీడియాలో రావడంతో ప్రజలు మళ్ళీ వణికిపోతున్నారు. గతం తాలూకు విషాదం, చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా చాలా మంది బయట పడనే లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి ముప్పు ముంచుకొస్తే జరిగే విలయం మాటలకు అందేది కాదు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు మరోసారి చర్యలకు సిద్ధమవుతున్నాయి. మాస్కులు వ్యాక్సిన్లు అంటూ జనాన్ని ఉత్తేజపరిచే కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఓమిక్రాన్ పేరుతో ఒక సినిమా అప్పుడెప్పుడో అరవై ఏళ్ళ క్రితం వచ్చిన సంగతి తెలుసుకుని మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. దాని తాలూకు పోస్టర్ అక్కడ ఉన్న క్యాప్షన్ చూసి సదరు దర్శకుడు భవిష్యత్తుని ముందే ఊహించి తీశాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రసిద్ధ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర దీని గురించి ట్వీట్ చేయడంతో దీనికి మరింత ప్రాచుర్యం దక్కింది. అసలు విషయం వేరే ఉంది. 1963లో వచ్చిన ది ఓమిక్రాన్ వేరియంట్ అనేది ఇటాలియన్ సినిమా. నిజానికి ఇది ‘ఒమిక్రాన్’ అనే పేరుతోనే వచ్చింది యుగో గ్రెగరొట్టి అనే ఆయన దర్శకుడు వేరియంట్ అనే పదాన్ని ఇటీవల ఫెక్ గా చేర్చారు. ఇది వైరస్ కాన్సెప్ట్ మీద తీసింది కాదు. కథ వేరే ఉంది. ఒక గ్రహాంతరవాసి భూమి మీదకు వచ్చి చనిపోయిన ఓ ఫ్యాక్టరీ వర్కర్ శరీరంలోకి చేరుతుంది
అలా శవానికి ప్రాణం వచ్చాక తనే శాసనకర్త కావాలని నరమేథం మొదలుపెడుతుంది. అక్కడి నుంచి ఊళ్లే స్మశానాలుగా మారిపోతాయి. ఆ తర్వాత ఏమైంది అనేది అందులోనే చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రం ఎక్కడా అందుబాటులో లేదు. కేవలం ఒక పోస్టర్ మాత్రమే ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. ఓటిటిలో నెటిజెన్లు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇండియన్ యాప్స్ లో దొరకడం లేదు. అసలు ఇటలీలోనైనా దొరుకుతోందో లేదో. మొత్తానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా సంగతేమో కానీ ఇప్పుడీ వైరస్ మనదేశంలో వ్యాప్తి చెందకపోతే అదే చాలు. కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు తిరిగి సంక్షోభంలో పడకుండా ఊపిరి పీల్చుకుంటాయి
Also Read : Akhanda : ఖండ ఖండాలలో దుమ్మురేపుతున్న “అఖండ”