Akhanda : ఖండ ఖండాలలో దుమ్మురేపుతున్న "అఖండ"

By Naveen Kumar Areti Dec. 02, 2021, 05:58 pm IST
Akhanda : ఖండ ఖండాలలో దుమ్మురేపుతున్న "అఖండ"

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం థియేటర్లలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా విదేశాల్లోనూ బాలయ్య "అఖండ" కి కలెక్షన్ల వర్షం కురుస్తుంది.

మొదటి ఆటతోనే ‘అఖండ’ చిత్రానికి హిట్ టాక్ వచ్చేసింది. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్ కి, ఫైట్స్​కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. స్క్రీన్ మీద బాలయ్య బొమ్మ పడగానే ఫాన్స్ హంగామా మాములుగా లేదు. బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్ కి, థమన్ ఇచ్చిన దుమ్మురేపే బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. "ప్రతి సీను..ప్రతి షాటు..మైండ్ పోతుంది లోపల" అని ఎవరో అన్నట్టు, అచ్చం ఈ "అఖండ" కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా బాలయ్య నటవిశ్వరూపం, గెటప్స్, ఆయన చెప్పే డైలాగ్స్ , తమన్ BGM ,యాక్షన్ ఎపిసోడ్స్ & ఇంటర్వెల్ బ్లాక్ కి దిమ్మతిరిగే రెస్పాన్స్ కనపడుతుంది. ఈ వయసులో కూడా బాలకృష్ణ గారి హార్డ్ వర్క్ & డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి.

సింహ..లెజెండ్ తర్వాత ఈ అఖండ మూవీతో బోయపాటి శ్రీను - బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టారని బాలయ్య ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read : Akhanda Review : అఖండ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp