Idream media
Idream media
1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు గత నెల 25న ఏపీ కేబినెట్ ఆమోదించింది. చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది. దానిలో భాగంగానే 13 జిల్లాల ఏపీకి 26 జిల్లాలుగా మారుస్తూ గెజిట్ విడుదలైంది. వెనువెంటనే అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. స్వల్ప మార్పులను కూడా చకచకా చేసుకుంటూ వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్కారు వేగంగా ముందుకెళ్తుంటే.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. దీనికి కేంద్రం అనుమతి కావాలని, జనగణన పూర్తి కాకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటు కుదరదని ఇలా రకరకాల ఊహాగానాలను తెరపైకి తెచ్చాయి. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు జనగణన అడ్డంకి కాదని ప్రభుత్వం చెబుతూనే ఉంది.
జిల్లాల పునర్విభజనపై తాజాగా సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రకారం ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఉన్నతాధికారులను . ఈ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, హోం మంత్రి సుచరిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశించారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే 26 జిల్లాలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ నెల 26 వరకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కావాల్సిన వనరులపై సీఎం సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియ త్వరలోనే ఆచరణలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్