iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: పాపం నయని.. బిగ్ బాస్ కోసం దాదాపు రూ.10 లక్షలు ఖర్చు!

Bigg Boss 7 Telugu: పాపం నయని.. బిగ్ బాస్ కోసం దాదాపు రూ.10 లక్షలు ఖర్చు!

భాష ఏదైనా కూడా బిగ్ బాస్ షో అనగానే గుర్తింపు, భవిష్యత్ ఉంటుందని గట్టిగా నమ్ముతారు. ఈ షోలో పాల్గొంటే వారి కెరీర్ కు కచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్ముతారు. నిజానికి ఈ షో చాలా మంది సెలబ్రిటీల కెరీర్ ను గాడిలో పెట్టింది. కానీ, చాలా మంది పేరును నెగిటివ్ కూడా చేసింది. ఈ షోలో పాల్గొన్న తర్వాత అవకాశాలు లేక ఊరికే ఉండిపోయిన వాళ్లు కూడా లేకపోలేదు. అయితే పేరు, అవకాశాలు సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ వల్ల మంచి రెమ్యూనరేషన్ వస్తుంది అంటారు. అయితే నయనీ పావనికి మాత్రం.. రెమ్యూనరేషన్ పరంగా కూడా పెద్దగా ఒరిగింది ఏమీ లేదని చెబుతున్నారు.

నయనీ పావని.. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో.. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి వెళ్లిన మొదటి వారమే బయటకు వచ్చేసింది. ఆట పరంగా ఎంతో బాగా ఆడినా కూడా ఆమెకు ఓట్లు పడలేదు అని ఎలిమినేట్ చేశారు. నిజానికి ఆట పరంగా అయితే.. నయనీతో పాటు నామినేషన్స్ లో ఉన్న అశ్వినీ శ్రీ, శోభాశెట్టి, పూజామూర్తి పెద్దగా ఆడింది ఏమీ లేదనే చెప్పాలి. బాల్ గేమ్ లో కూడా 7 అబ్బాయిలతో పోటీ పడిన ఏకైక అమ్మాయిగా నయనీ పావని ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆట అనే సరికి అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ప్రాణం పెట్టి ఆడింది. నామినేషన్స్ లో కూడా తుప్పాస్ రీజన్స్ చెప్పకుండా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది.

ఇంక హౌస్ లో, పనుల్లో అందరితో కలిసి ఎంతో యాక్టివ్ గా పాల్గొంది. ఇవన్నీ చూసి నయనీ పావని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యింది అని చెప్పగానే అందరూ ఆన్ లైన్ లో నిరసనలు ప్రారంభించారు. బిగ్ బాస్ సీజన్ మీద నయని కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని వచ్చింది. కచ్చితంగా కనీసం 10 వారాలు అయినా హౌస్ లో ఉంటాను అనుకుంది. కానీ, అనూహ్యంగా మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అభిమానులు ఓట్లు వేయకపోవడం వల్లే బయటకు వచ్చాను అనుకుంటోంది. కానీ, ప్రేక్షుకులు మాత్రం నయనీ పావనీది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సరే బిగ్ బాస్ వల్ల పేరు ఎలాగూ రాలేదు.

కనీసం రెమ్యూనరేషన్ అయినా బాగా వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ, నయనీకి అలా కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు అంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ కోసం నయనీ పావని ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ కు వచ్చింది. అంటే ఫ్లైట్ టికెట్లు దగ్గర దగ్గర రూ.లక్షన్నర అయ్యుంటాయి. ముందే 10 వారాలు అని ఫిక్స్ అయ్యింది కాబట్టి దానికి తగినట్లుగానే షాపింగ్ చేసుంటుంది. అవన్నీ చూసుకుంటే దాదాపు రూ.10 లక్షల వరకు లెక్క తేలి ఉంటుంది అంటున్నారు. ఇంక చేతికి వచ్చిన వాటి సంగతి చూస్తే.. ఈమె ఇన్ ఫ్లూఎన్సర్ గా వచ్చింది కాబట్టి.. పెద్దగా రెమ్యూనరేషన్ లేదు అంటున్నారు.

రోజుకు రూ.30 వేల వరకు ఇచ్చి ఉంటారు. అంటే రెమ్యూనరేషన్ పరంగా 6 వారాలకు రూ.12 లక్షలు వరకు వస్తాయి. వాటిలో ట్యాక్సులు పోతే రూ.10 లక్షల వరకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అవి కాస్తా ఖర్చులకే సరిపోతాయి. అంటే నయనీకి బిగ్ బాస్ వల్ల రెమ్యూనరేషన్ పరంగా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆడింది ఒక వారామే కదా.. 6 వారాల రెమ్యూనరేషన్ ఏంటి అనుకుంటున్నారా? వీళ్లు వచ్చింది వైల్డ్ కార్డుగా అయినా కూడా అగ్రిమెంట్ మాత్రం మొదటి వారం నుంచి లెక్క అనమాట. అంటే ముందు జరిగిన 5 వారాలకు కూడా రెమ్యూనరేషన్ వస్తుంది అంటున్నారు. మరి.. నయనీ పావని ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి