iDreamPost
android-app
ios-app

Nani : దసరా కోసం న్యాచురల్ స్టార్ సాహసం

  • Published Jan 18, 2022 | 10:38 AM Updated Updated Jan 18, 2022 | 10:38 AM
Nani : దసరా కోసం న్యాచురల్ స్టార్ సాహసం

న్యాచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో పేరు తెచ్చుకున్న నానికి కొన్ని వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఊరట కలిగేలా శ్యామ్ సింగ రాయ్ మంచి విజయం సాధించింది. పుష్ప పార్ట్ 1 వచ్చిన వారానికే విడుదల చేయాల్సి వచ్చినా దాని తాకిడిని తట్టుకుని మరీ కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. రికార్డులు బద్దలు కొట్టిన విజయం కాదు కానీ దానికి పెట్టిన భారీ బడ్జెట్ కు న్యాయం జరిగేలా ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర పూర్తయిన దీని రన్ ఈ శుక్రవారం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తర్వాత శుభం కార్డుకు వచ్చేస్తుంది. రెండు వరస ఓటిటి రిలీజులు వాటి తాలూకు ఫలితాల తర్వాత నానికి మంచి ఊరట ఇచ్చింది శ్యామ్ సింగ రాయ్.

దీని తర్వాత చేస్తున్న అంటే సుందరానికి షూట్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అమాయకుడిలా కనిపించనున్న నాని నెక్స్ట్ చేయబోయే దసరాకు ఊర మాస్ గెటప్ కు వచ్చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందబోయే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కీర్తి సురేష్ హీరోయిన్. నేను లోకల్ తర్వాత మళ్ళీ నానితో జట్టు కడుతోంది. ఇందులో హీరో క్యారెక్టర్ కి నెగటివ్ షేడ్స్ ఉంటాయని, మరీ వి టైప్ లో కాకుండా మంచివాడే చెడ్డపనులు చేయాల్సి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద దీన్ని చాలా ఆసక్తికరంగా రూపొందిస్తారట. అంటే విలన్ టచ్ ఉన్న హీరో పాత్రను మరోసారి నాని చేయబోతున్నాడన్న మాట.

ఇది అధికారికంగా చెప్పలేదు కానీ మొత్తానికి లీకైన సోర్స్ ని బట్టి చూస్తే నిజమే అనిపించకమానదు. దసరాలో మంచి క్యాస్టింగ్ ఉంది. సాయికుమార్, సముతిరఖని, జరీనా వాహాబ్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. బ్యాక్ డ్రాప్ తాలూకు డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి ఇదో ఇంటెన్స్ డ్రామా అనే ఇంప్రెషన్ అయితే ఇవ్వగలిగారు. ఛాలెంజింగ్ అనిపించే సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్న నాని ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ ని కొనసాగించడం చాలా అవసరం. విషయమున్న కథ పడితే ప్రెజెంటేషన్ యావరేజ్ గా ఉన్నా ఈజీగా గట్టెక్కించే నానికి భలే భలే మగాడివోయ్ రేంజ్ బ్లాక్ బస్టర్ ఒకటి పడాలి

Also Read : Bollywood : బాలీవుడ్ క్రియేటివిటీకి మనమే దిక్కు