iDreamPost
iDreamPost
నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సులు సెప్టెంబర్ 23న కొత్త పాత తేడా లేకుండా అన్ని సినిమాల టికెట్ రేట్లు 75 రూపాయలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవకాశాన్ని బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ బ్రహ్మాండంగా వాడుకుంటోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మూడు మల్టీ ప్లెక్సుల చైన్స్ లో ఇప్పటికే 9 లక్షల టికెట్లు అమ్మేసుకుంది. ఇంకొన్ని గంటలు టైం ఉంది కాబట్టి 11 లక్షలు దాటే అవకాశముందని ట్రేడ్ పండితుల అంచనా. తెలంగాణ, ఏపిలో కనిష్ట ధర ప్రభుత్వ జిఓ, లైసెన్స్ విధానం ప్రకారమే 112 రూపాయలు కాబట్టి ఇక్కడ అంతకన్నా తక్కువగా ఇవ్వలేకపోతున్నారు. కొన్ని షోల అమ్మకాలు జరుగుతున్నాయి
బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర నగరాల్లో ఆడియన్స్ ఈ ఆఫర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆన్ లైన్ల టికెట్లు పెట్టడం ఆలస్యం క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. మాములుగా ఇక్కడ చెప్పిన సిటీస్ లో వీకెండ్స్ లో కింది తరగతే మినిమమ్ రెండు వందల పైమాటే ఉంటుంది. అలాంటిది సగం కన్నా తక్కువగా వస్తుంటే ఫ్యామిలీస్ తో పాటు పోలోమని రెడీ అవుతున్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున రీ రిలీజ్ అవుతున్న అవతార్ రచ్చ మాములుగా లేదు. ఎగబడి కొనేసుకుంటున్నారు. హైదరాబాద్ ఏఎంబి మాల్ లో ఒకే ఒక జీవితం నూటా పన్నెండు రూపాయలకు చూసేయొచ్చు. అల్లూరిని సైతం ఇదే ఆఫర్ లో పివిఆర్ ఇవ్వడం గమనార్హం.
ఇదిలా పరిమితం చేయకుండా నెలకోసారి కనక అమలు పరిస్తే అద్భుత ఫలితాలను చూడొచ్చు. కొత్త రిలీజులకు కాకపోయినా కనీసం రెండు మూడు వారాలు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న వాటికి ఈ సౌకర్యం కలిగిస్తే ఫుట్ ఫాల్స్ అమాంతం పెరుగుతాయి. బ్రహ్మాస్త్ర ఋజువు చేస్తోంది అదే. రెండో వారంలోనే నెమ్మదించిన ఈ విజువల్ గ్రాండియర్ ఇప్పుడీ స్కీం వల్ల ఎంతలేదన్నా కనీసం ఇరవై కోట్ల దాకా అదనపు గ్రాస్ రాబడుతుందని అంచనా. అదే జరిగితే పదిహేనో రోజు కెజిఎఫ్, బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టినట్టే. మాములు పరిస్థితుల్లో అయితే రెగ్యులర్ రేట్లతో పది కోట్లు రావడమే గొప్ప. దీన్ని డిస్ట్రిబ్యూటర్లు ఇండస్ట్రీ పెద్దలు సీరియస్ గాతీసుకుని ఫ్యూచర్ లోనూ ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తే మంచిది