నారప్పా – సినిమా ఒకటే కాదప్పా

ఒక సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరుపుకున్నాక మళ్ళీ ఏడాది తర్వాత థియేటర్లో రావడం అరుదు. అందులోనూ వెంకటేష్ లాంటి పెద్ద హీరో మూవీ అయితే అభిమానులకది స్పెషల్ గా ఉంటుంది. నారప్ప ద్వారా వాళ్ళ కోరికను నిర్మాత సురేష్ బాబు నిజం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13న వెంకీ పుట్టినరోజు సందర్భంగా కేవలం ఒక్క రోజు నాలుగు షోల కాన్సెప్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో నారప్పను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది ఓటిటిలో వచ్చినప్పుడు ఇంత మాస్ బొమ్మను బిగ్ స్క్రీన్ మీద మిస్ అయ్యామని ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఎఫ్3లో ఒక సీన్ పెట్టి సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం గుర్తే

అలా అని కేవలం ఇక్కడితో పరిమితం కావడం లేదు సురేష్ టీమ్. నారప్పతో పాటు వెంకటేష్ సూపర్ హిట్ సినిమాల్లో నుంచి ఐకానిక్ సీన్స్, బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని అదనంగా ప్రదర్శించబోతున్నారు. అంటే ఇదో స్పెషల్ బెనిఫిట్ అన్న మాట. కలియుగ పాండవులుతో మొదలుకుని బొబ్బిలి రాజా, కలిసుందాం రా, జయం మనదేరా, రాజా, గణేష్ లాంటి హిట్ చిత్రాల నుంచి చేయించిన రీల్ ప్రతి ఆటకు ఎంజాయ్ చేయొచ్చు. సాధారణంగా ఇలాంటి ప్రీమియర్లకు ప్రైమ్ ఒప్పుకోదు. కానీ తమ ప్రత్యేక అభ్యర్థన మీద ఫ్రీ స్క్రీనింగ్ తో పాటు షేర్ లో ఎలాంటి పర్సెంటెజ్ వద్దని చెప్పిందట. దీంతో నారప్పకు వసూలయ్యే మొత్తాన్ని చారిటికి చేరేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒకరకంగా నారప్పది వెరైటీ రీ రిలీజ్ అని చెప్పాలి. గతంలో నాని వి కూడా ఇదే తరహాలో లాక్ డౌన్ అయ్యాక థియేటర్లలో విడుదల చేస్తే పబ్లిక్ పెద్దగా పట్టించుకోలేదు. అది డిజాస్టర్ మూవీ కాబట్టి ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. కానీ నారప్ప అలా కాదు. మాస్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా వెంకీని ఇంత ఊర మాస్ రోల్ లో చూసి చాలా కాలమవ్వడంతో ఫ్యాన్స్ మురిసిపోయి చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బర్త్ డే అకేషన్ సందర్భంగా వెండితెరపై ఆ అనుభూతి పొందటం ప్రత్యేకంగా ఉంటుంది. అన్నట్టు ఈ పుట్టినరోజుకు వెంకటేష్ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అనౌన్స్ మెంట్లు ఉండటం లేదని సురేష్ బాబు చెప్పేశారు. సో వెయిటింగ్ తప్పదు

Show comments