iDreamPost
android-app
ios-app

Shyam Singha Roy : నాని డ్యూయల్ రోల్ – ఇదా కహాని

  • Published Nov 21, 2021 | 4:19 AM Updated Updated Nov 21, 2021 | 4:19 AM
Shyam Singha Roy : నాని డ్యూయల్ రోల్ – ఇదా కహాని

వచ్చే నెల 24న విడుదల కాబోతున్న న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ టీజర్ వచ్చాక అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అందులో చూపించిన ఇంటెన్సిటీ, కోల్కతా బ్యాక్ డ్రాప్ విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటికి తోడు సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, కీర్తి శెట్టి లిప్ లాక్ లు హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. మొత్తానికి తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా నాని ఏదో కొత్త సాహసం చేస్తున్నాడనే క్లారిటీ అయితే వచ్చేసింది. టాక్సీవాలాతో పేరు తెచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్ దీనికి దర్శకుడు. వరుణ్ తేజ్ గనితో పోటీ ఉన్నప్పటికీ శ్యాం సింగ రాయ్ తాలూకు బిజినెస్ డీల్స్ మాత్రం ఏరియాల వారిగా చకచకా పూర్తి చేస్తున్నారు.

ఇందులో చాలా షాకింగ్ ట్విస్టులు ఉంటాయని ఇన్ సైడ్ న్యూస్. నాని ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు భారతదేశంలో పాతుకుపోయిన దేవదాసి వ్యవస్థను ఎదిరించే జర్నలిస్ట్ కం లీడర్ శ్యామ్ సింగ్ రాయ్ గా నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిసింది. అక్కడే సాయి పల్లవి పాత్ర దేవదాసిగా ఎంట్రీ ఇవ్వడం, ఆ చెరసాల నుంచి ఆమెను విడిపించి పెళ్లి చేసుకోవడం కట్ చేస్తే వాళ్ళిద్దరికీ పుట్టిన రెండో నాని ఇదంతా చాలా ఆసక్తిగా సాగుతుందని తెలిసింది. తండ్రి గురించి తెలుసుకున్న ఇప్పటి వారసుడు చరిత్రను తవ్వడం ద్వారా ఎం చేశాడు అనేదే ఇందులో కీలకమైన పాయింట్ గా చెబుతున్నారు

సో ఇది రెండు కాలాలకు సంబంధించిన స్టోరీ అనే క్లారిటీ వచ్చినట్టే. అయితే ,మొదటి నానినే రెండో నానిగా పునర్జన్మ ఎత్తుతాడా లేక కొడుకా అనేది మాత్రమె క్లారిటీ లేదు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న శ్యామ్ సింగ రాయ్ టార్గెట్ సుమారు 40 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. ఆలోగా అఖండ, పుష్పలు వచ్చేస్తాయి కాబట్టి థియేట్రికల్ మార్కెట్ పరంగా ఉన్న రిస్కులు ఏమేం ఉన్నాయో క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా 35 కోట్ల షేర్ టచ్ చేసిన సినిమా లవ్ స్టోరీ ఒక్కటే. నాలుగు నెలలలో ఒక్కటంటే ఒక్కటి నలభైని చేరుకోలేదు. మరి నాని చాలా గ్యాప్ తర్వాత ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ దీంతో దక్కుతుందేమో చూడాలి

Also Read : Naga Chaitanya : ఆరు నెలల్లో నాలుగుసార్లు అక్కినేని హీరో దర్శనం

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş