Naga Chaitanya : ఆరు నెలల్లో నాలుగుసార్లు అక్కినేని హీరో దర్శనం

By iDream Post Nov. 20, 2021, 06:30 pm IST
Naga Chaitanya : ఆరు నెలల్లో నాలుగుసార్లు అక్కినేని హీరో దర్శనం

ఈ ఏడాది లవ్ స్టోరీ రూపంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగ చైతన్య రాబోయే రోజుల్లో గ్యాప్ లేకుండా అభిమానులను అలరించబోతున్నాడు. కొత్త ఏడాదిలో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు. నాన్న నాగార్జునతో కలిసి చేస్తున్న బంగార్రాజు సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాల పోటీ ఉన్నా సరే తగ్గేదేలే అని రిలీజ్ డేట్ ని లాక్ చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా ఇన్ సైడ్ టాక్. అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా కొత్త డేట్ ఇవాళే వచ్చింది. ఇందులో చైతు హీరో కాకపోయినా ముఖ్యమైన పాత్రే చేశాడు కాబట్టి ఫ్యాన్స్ కి ఇది కూడా కౌంట్ లోకి వస్తుంది.

ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన థాంక్ యు అప్ డేట్ ఇంకా రావాల్సి ఉంది. 2022 వేసవిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పైన చెప్పిన రెండు సినిమాల తర్వాత వస్తుందా లేక అంతకన్నా ముందే షెడ్యూల్ చేశారా క్లారిటీ లేదు. ఇందులో చైతు మహేష్ బాబు వీరాభిమానిగా కనిపిస్తాడు. ఇదే విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న వెబ్ సిరీస్ కూడా త్వరలోనే షూట్ పూర్తి చేసుకోబోతోందట. హారర్ తరహాలో ఒక సూపర్ న్యాచులర్ థ్రిల్లర్ గా దీన్ని తెరకెక్కించినట్టు తెలిసింది. ప్రియా భవాని శంకర్ ఇందులో హీరోయిన్ గా చేసిందని సమాచారం. ముందు హాట్ స్టార్ అన్నారు కానీ తాజాగా ప్రైమ్ లో రావొచ్చని అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే 2022 సగం అయ్యేలోపే నాగ చైతన్య నాలుగు సార్లు తెరమీద్ద కనిపిస్తాడు. ఓటిటి ఎంట్రీతో కలిపి లెండి. సమంతాతో విడాకుల వ్యవహారం అయిపోయాక చైతు ఇంకా సీరియస్ గా కెరీర్ మీద దృష్టి పెట్టబోతున్నాడు. రెండో పెళ్లి ఉంటుందా అది ఎప్పుడు అని ఆలోచించడం తొందపాటు చర్య అవుతుంది కానీ మొత్తానికి అదీ ఎప్పుడో ఒకప్పుడు జరగక మానదు. బంగార్రాజు మీద మాత్రం చైతుకి చాలా నమ్మకం ఉంది. నాన్న ఎంతో ముచ్చటపడి మరీ నిర్మిస్తున్న ఈ సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ లో తనకు జోడిగా కృతి శెట్టి నటిస్తుండటంతో ఈ జంట మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చేవారమే టీజర్ వదలబోతున్నారు

Also Read : KGF2 & Laal Singh Chaddha : రాఖీ భాయ్ తో తలపడనున్న ఆమిర్ ఖాన్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp