అంటే సుందరానికి నష్టం ఎంత?

ఏంటో కొన్ని సినిమాలు మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు తెచ్చుకోవడంలో ఫెయిలవుతూ ఉంటాయి. అంటే సుందరానికి అదే కోవలోకి చేరిపోయింది. రిలీజ్ ముందు వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ తో 30 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నా దానికి తగ్గట్టు బ్రేక్ ఈవెన్ అందుకోవడంలో తడబడి ఫైనల్ గా 9 కోట్లకు పైనే లాస్ మిగిల్చిందని ట్రేడ్ టాక్

ఇంకో నాలుగు రోజుల్లో జూలై 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది కనక ఇకపై కలెక్షన్లు ఆశించడం అత్యాశే. నైజామ్ లో 6 కోట్ల 22 లక్షలు, సీడెడ్ 1 కోటి 32 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 70 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 87 లక్షలు, గుంటూరు కృష్ణ 2 కోట్లు, నెల్లూరు 60 లక్షలు, ఓవర్సీస్ 5 కోట్ల 75 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 70 లక్షలు దాకా అంటే సుందరానికి కలెక్ట్ చేసింది.

ఇదంతా కలిపి షేర్ రూపంలో 21 కోట్ల 19 లక్షలు తేలుతుంది. పెట్టుకున్న టార్గెట్ 31 కోట్లు. దీన్ని బట్టే నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నానిని ఈ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. భలే భలే మగాడివోయ్ రేంజ్ లో ఆడుతుందనుకుంటే కనీసం నిన్ను కోరిలా కూడా పెర్ఫార్మ్ చేయలేదు. నెక్స్ట్ పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకుని నటిస్తున్న దసరా ఖచ్చితంగా హిట్ అయితేనే మార్కెట్ సేఫ్ అవుతుంది.

Show comments