iDreamPost
iDreamPost
ఏడాదికి కనీసం మూడు సినిమాలు విడుదల చేయాలన్న ప్లానింగ్ తో ఉండే న్యాచురల్ స్టార్ నానికి గత ఏడాది ఆ కోరిక నెరవేరలేదు. వి వచ్చింది కానీ అది కూడా డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ కావడంతో ఎక్కువ ఆనందించడానికి లేకుండా పోయింది. దానికి తోడు మరీ దారుణంగా డిజాస్టర్ కావడం అభిమానులను బాధ పెట్టింది. కరోనా వల్ల డిసెంబర్ దాకా థియేటర్లు తెరుచుకోనే లేదు. అయితే 2021లో ఇలాంటి ఇబ్బంది ఉండదనుకుంటే సెకండ్ వేవ్ వచ్చి ఏకంగా రెండు నెలలు సినిమా హాళ్లు మూతబడ్డాయి. ఇప్పుడప్పుడే పరిస్థితి నార్మల్ అయ్యేలా లేదు. సో నాని స్ట్రాటజీ ఈ ఏడాది కూడా వర్కౌట్ కానట్టే కనిపిస్తోంది.
టక్ జగదీశ్ ఫస్ట్ కాపీతో సహా సిద్ధంగా ఉన్నా ఆగస్ట్ కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదు. మరోవైపు శ్యామ్ సింగరాయ్ ని జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు. దీని తర్వాత అంటే సుందరానికి సెట్స్ పైకి వెళ్తుంది. ఇవి ఖచ్చితంగా ఈ ఏడాది దీపావళిలోగానే పూర్తవుతాయి. కానీ రిలీజ్ మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. టక్ జగదీష్ గురించి ఓటిటి టాక్ వచ్చినప్పటికీ అది నిజం కాదని తర్వాత క్లారిటీ వచ్చింది. కాకపోతే లవ్ స్టోరీతో పాటు ఎప్పుడు బరిలో దిగాలనేది భేతాళ ప్రశ్న. శ్యామ్ సింగ రాయ్ ని డిసెంబర్ కి ప్లాన్ చేసుకున్నా కూడా అంటే సుందరానికి మాత్రం వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది.
మరోవైపు నిర్మాతగా కూడా నాని చాలా తెలివిగా సెట్ చేసుకుంటున్నారు. హిట్ సీక్వెల్ ని అడవి శేష్ తో ప్లాన్ చేసుకోవడం వల్ల దానికి పాన్ ఇండియా కలర్ వస్తోంది. ఇటీవలే హీరోయిన్లను కీలక పాత్రల్లో పెట్టి స్టార్ట్ చేసిన మీట్ క్యూట్ ని చాలా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేసేలా ఫిక్స్ చేసుకున్నారు. తను హీరోగా నటించినవి కాకుండా ఎలాంటి రిస్క్ లేని ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నాని ఎంత నేర్పుగా సాగుతున్నాడో అర్థమవుతోంది. థియేటర్ల అనిశ్చితి త్వరగా వీగిపోతే బిగ్ స్క్రీన్ మీద మొదటి పలకరించే హీరోల్లో నానినే ముందుంటాడు. కాకపోతే అది ఆగస్టా లేక సెప్టెంబరా అనేది కాలమే నిర్ణయించాలి