మహారాష్ట్రంలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ మృత్యు ఘోష వినిపిస్తోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 24 మంది చనిపోయారు. అందులో 12 మంది శిశువులు ఉన్నారు. అలానే అర్థరాత్రి దాటిన తరువాత మరో ఏడుగురు రోగులు మరణించారు. వీరిలో కూడా నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో గడిచిన 48 గంటల వ్యవధిలో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. ఈ ఇష్యూపై మహారాష్ట్ర సర్కార్ త్రిసభ్య కమిటీని వేసింది. మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి డీన్ శంకర్ రావు చవాన్ తెలిపారు. అలానే పలువురు సిబ్బంది బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్లడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వారిలో శిశువులతో పాటు గర్భిణీలు ఉన్నట్లు తెలుసుస్తోంది.
అలానే ప్రస్తుతం మరో 70 మంది పరిస్థితి విషంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మరణాల్లో కొన్ని గుర్తుతెలియని విషం కారణంగా సంభవించినట్లు తెలుస్తోందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తెలిపారు. చాలా మంది రోగులు దూర ప్రాంతలా నుంచి ఇక్కడికి వస్తారని, దీనికి తోడు వైద్యం అందడంలో జాప్యం కారణంగా మరికొందరు చనిపోయినట్లు ఆస్పత్రి డీన్ శంకర్ చవాన్ తెలిపారు. సోమవారం మృతి చెందిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చిన వారున్నారని మహారాష్ట్ర వైద్య, విద్య, పరిశోధన విభాగం సంచాలకుడు దిలీఫ్ మైశేఖర్ వెల్లడించారు. మరి.. నాందేడ్ ఆస్పత్రిలో జరుగుతున్న ఈ మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.