Idream media
Idream media
తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఉంటుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతానికి ఫలితాల సరళి ఏకపక్షంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా, వరుసగా అన్నింట్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ శాసన సభ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివా రం ఉదయం 8 గం.కు నల్గొండ పట్టణంలో ని అర్జాలబావి సమీపంలో ని (రాష్ట్ర గిడ్డంగుల సంస్థ )ఎఫ్.సి.ఐ గోదాముల్లో ప్రారంభమైంది. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులకు కారణంగా ఎలక్షన్ కమిషన్లే అన్న అపవాదు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో 400 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు 300 మంది పోలీసులకు, అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు, మీడియా ప్రతినిధులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ నెగెటివ్ వచ్చిన వారినే కౌంటింగ్ సెంటర్‌లోకి అనుమతిచ్చారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రెండు వేర్వేరు హాళ్లలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు. మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఫలితాలు ఏకక్షపంగా కొనసాగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో 1475 ఓట్ల ఆధిక్యంలో భగత్ (టీఆర్‌ఎస్). టీఆర్‌ఎస్‌కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 2216 ఓట్లతో ముందంజలో కొనసాగారు. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 2665 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3421, కాంగ్రెస్‌కు 2882 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్ కూడా భగత్ లీడ్ లో కొనసాగారు. టీఆర్ఎస్ 4186 ఓట్లు పొందగా, కాంగ్రెస్ కు 3202 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 984 ఓట్ల ఆధిక్యత వచ్చింది. మొత్తంగా నోముల భగత్ 3,649 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఐదో రౌండ్ లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగింది. 4,334 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటి వరకూ జరిగిన ప్రతీ రౌండ్ లోనూ అధికార పార్టీనే దూసుకెళ్తోంది.
Also Read : అంచనాలకు అనుగుణంగానే కేరళ ఎర్రబారుతోంది..