iDreamPost
android-app
ios-app

నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమే.. థ్యాంక్ యు.. టీజర్ విడుదల..

  • Published May 25, 2022 | 6:24 PM Updated Updated May 25, 2022 | 6:24 PM
  • Published May 25, 2022 | 6:24 PMUpdated May 25, 2022 | 6:24 PM
నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమే.. థ్యాంక్ యు.. టీజర్ విడుదల..

సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా సక్సెస్ సాధించాలని కాన్సెప్టులు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. లవ్ స్టోరీ, సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాలతో ఆల్రెడీ హిట్ కొట్టాడు చైతూ. త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్స్ గా చేస్తున్నారు.

తాజాగా థ్యాంక్ యు టీజర్ విడుదల అయింది. నా సక్సెస్ కి నేనే కారణం అంటూ టీజర్ ని మొదలు పెట్టాడు చైతన్య. ఇందులో జీవితంలోని మూడు దశల్లో ఉండే భావోద్వేగాల్ని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో పడ్డ కష్టాల నుంచి కసిగా ఎదిగిన పాత్రలో నాగ చైతన్య నటించినట్టు చూపించారు. మూడు దశల్లో ముగ్గురి అమ్మాయిలతో ప్రేమ ఉంటుందని టీజర్లోనే చెప్పేసారు. అక్కడక్కడా ప్రేమమ్ సినిమా తాలూకు ఛాయలు కనిపించినా చూడటానికి కొత్తగానే ఉంది. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నిటిని మేళవించి ఈ థ్యాంక్ యు సినిమాని తెరకెక్కిస్తున్నారు.

చివరగా నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమే ఈ థ్యాంక్ యు అని డైలాగ్ తో ముగించారు. అయితే ఇది, టీజర్ మొదట్లో చెప్పిన డైలాగ్ ఇన్ డైరెక్ట్ గా సమంతకి చెప్పినట్టు ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. ఈ సినిమాలో చైతూ హాకీ ప్లేయర్ గా కూడా కనబడనున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య మరింత అందంగా కనిపించాడు. థ్యాంక్ యు సినిమాని జులై 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో మరో హిట్ సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు చైతూ. ఇక ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet