iDreamPost
android-app
ios-app

తమ్ముడి దర్శకుడితో నాగచైతన్య

  • Published Apr 15, 2020 | 12:03 PM Updated Updated Apr 15, 2020 | 12:03 PM
  • Published Apr 15, 2020 | 12:03 PMUpdated Apr 15, 2020 | 12:03 PM
తమ్ముడి దర్శకుడితో నాగచైతన్య

గత ఏడాది మజిలీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న నాగ చైతన్య కొత్త సినిమా తర్వాత ఏదీ రాలేదు. కరోనా గోల లేకపోతే వచ్చే నెల లవ్ స్టోరీ వచ్చేదేమో కానీ ఇప్పుడు సమ్మర్ లో కష్టమే. ఇంకా కొంత బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ బహుశా ఆగస్ట్ రిలీజ్ ని టార్గెట్ చేసుకోవచ్చు. అది కూడా దాని కన్నా ముందు వాయిదా పడిన సినిమాల వంతు అయ్యాకే. ఇదిలా ఉండగా చైతు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్.

అక్కినేని మూడు తరాలను ఒకే సినిమాలో చూపించి అద్భుతంగా డీల్ చేసిన మనం దర్శకుడు విక్రమ్ కుమార్ కు ఓకే చెప్పినట్టు వినికిడి. ఇప్పటికే పలు డిస్కషన్స్ అయ్యాయని లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి ప్రకటన వచ్చి ఉండేదని అంటున్నారు . ఒకవేళ ఇది నిజమైతే విక్రం కుమార్ సాలిడ్ హిట్ తో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది నానితో చేసిన గ్యాంగ్ లీడర్ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. నాని స్క్రీన్ మేజిక్, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇవేవి కాపాడలేకపోయాయి. అంతకు ముందు అఖిల్ తో చేసిన హలో కూడా అంతే. అయినప్పటికీ నాగార్జునకు విక్రం కుమార్ మీద మంచి గురి ఉంది.

మనం నాన్న అక్కినేని నాగేశ్వర్ రావు గారి చివరి సినిమాగా ఒక అందమైన జ్ఞాపకంగా విక్రం కుమార్ మలచిన తీరు గురించి పలుమార్లు ప్రస్తావిస్తూ ఉంటారు కూడా. సో విక్రం ఇప్పుడు ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటే మళ్ళి నిలదొక్కుకోవచ్చు. తన రేంజ్ సినిమా ఇవ్వలేదనే కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. సో చైతు ప్రాజెక్ట్ ని జాగ్రత్తగా డీల్ చేయాలి. అధికారికంగా ప్రకటన చేయలేదు కాబట్టి ఇంతకు మించి ఇప్పుడు చెప్పే అవకాశం లేదు కానీ లాక్ డౌన్ అయ్యాక పరిస్థితి సద్దుమణిగాక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియొచ్చు

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet