iDreamPost
iDreamPost
ఇప్పట్లో నైజామ్ టికెట్ రేట్ల వ్యవహారం తేలేలా లేదు. థాంక్ యు సినిమాకు సంబంధించిన ధరలు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. మొన్నో ఈవెంట్ లో ఈ మూవీకి తక్కువ ప్రెస్ పెడుతున్నామని, సింగల్ స్క్రీన్ కు వంద, మల్టీ ప్లెక్సులకు నూటా యాభై ప్లస్ జిఎస్టి ఉంటుందని దిల్ రాజు స్పష్టంగా చెప్పారు. తీరా ఇవాళ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కొన్ని క్రాస్ రోడ్స్, కూకట్ పల్లి థియేటర్లలో 175 రూపాయలు కనిపించగా అధిక శాతం మల్టీప్లెక్సుల్లో 200 నుంచి 250 మధ్యలో చూపించింది. ఇదేంటని షాక్ తిన్న కొందరు బుక్ చేసుకోబోతూ ఆగిపోయిన మాట వాస్తవం. టాక్ వచ్చాకే వీళ్ళు థియేటర్లకు కదిలే అవకాశం ఉంది
ఇవాళ ప్రెస్ మీట్ లో తన వైపే పొరపాటు జరిగిందని మేజర్, విక్రమ్ రేట్లే థాంక్ యుకి ఉంటాయని చెప్పారు. ఒకవేళ దిల్ రాజు ముందు అన్నట్టు లేదా హ్యాపీ బర్త్ డేకి అమలు చేసినట్టు 110 నుంచి 150 మధ్యలో థాంక్ యుకి ఫిక్స్ చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. నిజానికి ఈ సినిమా బంగార్రాజు టైపు మాస్ ఎంటర్ టైనర్ కాదు ఎమోషన్లు ఫీలింగ్స్ ని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి జర్నీని ఇందులో చూపించబోతున్నారు. సో ఆటోమేటిక్ గా మాస్ ని అంత సులభంగా ఆకట్టుకోలేం. మజిలీ హిట్ అయ్యింది కదాని అనొచ్చు. కానీ అప్పుడీ పరిస్థితులు లేవు. లాక్ డౌన్లు, టికెట్ హైకులు, ఓటిటి దూకుడు ఇవేవి లేని టైం అది.
అందుకే అంతగా వర్కౌట్ అయ్యింది. కానీ ఇప్పుడు సీన్ వేరుగా ఉంది. నిర్మాతలు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఓటిటి గ్యాప్ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ముందుగా దృష్టి సారించాల్సింది మాత్రం ముమ్మాటికీ టికెట్ రేట్ల మీదే. కేవలం ఏడాది గ్యాప్ లోనే 50 నుంచి 150 దాకా అమాంతం పెరిగిపోవడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా సినిమా సినిమాకీ మార్చుకుంటూ పోవడం చిరాకు తెప్పిస్తోంది. ఏదో ఆర్ఆర్ఆర్ లాంటి వాటికి ఓకే కానీ అన్నింటికి జిఓలను వాడే ప్రయత్నం చేయడం బెడిసికొడుతోంది. త్వరలో జరగనున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో మరింత మెరుగైన చర్యలు తీసుకుంటారేమో చూడాలి.