iDreamPost
android-app
ios-app

ప్రాజెక్ట్ Kలో టైం ట్రావెల్ ?

  • Published Sep 15, 2022 | 3:25 PM Updated Updated Dec 11, 2023 | 11:02 AM

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 ఇప్పటికీ అభిమానులు గర్వంగా చెప్పుకునే మ్యూజికల్ అండ్ ఎంటర్ టైనింగ్ క్లాసిక్. సూర్య 24 సైతం బాగా ఆడింది.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 ఇప్పటికీ అభిమానులు గర్వంగా చెప్పుకునే మ్యూజికల్ అండ్ ఎంటర్ టైనింగ్ క్లాసిక్. సూర్య 24 సైతం బాగా ఆడింది.

ప్రాజెక్ట్ Kలో టైం ట్రావెల్ ?

ఇటీవలే విడుదలైన శర్వానంద్ ఒకే ఒక జీవితం విమర్శకులతో పాటు ఆడియన్స్ మెప్పు కూడా పొందింది. కలెక్షన్లు మరీ బ్లాక్ బస్టర్ అనిపించే స్థాయిలో లేకపోయినా చూసిన ప్రతి ఒక్కరు సంతృప్తిని వ్యక్తం చేశారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 ఇప్పటికీ అభిమానులు గర్వంగా చెప్పుకునే మ్యూజికల్ అండ్ ఎంటర్ టైనింగ్ క్లాసిక్. సూర్య 24 సైతం బాగా ఆడింది. వీటికి స్ఫూర్తి ఎప్పుడో 80 దశకంలో వచ్చిన హాలీవుడ్ మూవీ బ్యాక్ టు ది ఫ్యూచర్ అయినప్పటికీ దాన్ని సౌత్ ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు మన దర్శకులు మలచిన తీరు మరపురాని విజయాలను అందించింది. అందుకే శర్వా హిట్టు కొట్టాడు.

దీనికి ప్రభాస్ ప్రాజెక్ట్ కెకి లింక్ ఏమిటని అనుకుంటున్నారా. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా కాల ప్రయాణం ఉంటుందట. అంటే సినిమాలో పాత్రలు వెనక్కు ముందుకు వెళ్తూ ఒక అద్భుతమైన అనుభూతిని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తాయట. నాగ అశ్విన్ విజన్ ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలియంది కాదు. దానికి తగ్గట్టే యాక్షన్, థ్రిల్, సస్పెన్స్, అన్నిటిని మేళవించి ప్రాజెక్ట్ కెని ప్రెజెంట్ చేస్తారని వినికిడి. ప్రభాస్ క్యారెక్టర్ నలభై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో కనిపించే పాత్రలో అమితాబ్ బచ్చన్ షాక్ ఇస్తారని అంటున్నారు. ఇదంతా అనఫీషియల్ న్యూసే.

ఒకవేళ వాస్తవమైతే మంచి కిక్ ఇచ్చే కంటెంట్ అయితే ఇందులో ఉంటుందన్న మాట. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ కు మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఇందులో భాగమవుతున్నారు. కాకపోతే విడుదలకు మాత్రం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది. 2023లో ఆది పురుష్, సలార్ లు ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి ప్రాజెక్ట్ కె 2024లో ఉంటుంది. ఒకవేళ ఆ ఏడాది మారుతీ మూవీని ఫిక్స్ చేస్తే ఇంకో సంవత్సరం పెండింగ్ పడిపోతుంది. ఎంత లేట్ చేసినా దానికి తగ్గ మ్యాటర్ తో కనువిందు చేయనున్న ప్రాజెక్ట్ కె డార్లింగ్ కెరీర్ బెస్ట్ అవ్వొచ్చని టాక్