Idream media
Idream media
‘‘జగన్ మావయ్య ది మల్లె వంటి మనసు. నేను సెకండ్ క్లాస్ చదివేటప్పుడు 20 మంది స్నేహితులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 88 మంది స్నేహితులయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మన చదువుల కోసం జగన్ మామయ్య చేస్తున్న సేవలను మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్నారు. గతంలో బడికి పోయే టప్పుడు అమ్మ లంచ్ బాక్స్ పెట్టేది. అదే స్కూళ్లో తినేదాన్ని. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ‘‘ జగనన్న గోరుముద్ద’ కార్యక్రమంలో భాగంగా రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఆ భోజనం తినటం వల్ల మేము చాలా యాక్టివ్‌గా ఉంటున్నాము. రోజుకో వెరైటీ ఫుడ్ తింటున్నాము. ఇలాంటి ఫుడ్ అందిస్తున్న జగన్ మామయ్యకు చాలా చాలా థాంక్స్!’’
– ఓ చిన్నారి విద్యార్థిని వేలాది మంది జనం ముందు.. తూర్పు గోదావరి జిల్లాలో ‘జగనన్న విద్యాకానుకస ప్రారంభ వేదికపై పలికిన పలుకులు ఇవి.
ప్రతిపక్షాలు సైతం అవాక్కయ్యేలా, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా మెచ్చుకునేలా పాఠశాలల్లో నాడు – నేడు వచ్చిన మార్పునకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అవి ప్రభుత్వ పాఠశాలలేనా.. అన్నంతగా మార్పును సంతరించుకున్నాయి. ఏపీలో మొత్తం 44,639 ప్రభుత్వ పాఠశాలలుండగా, అందులో 15,715 బడుల్లో నాడు-నేడు మొదటి దశ మొదలుపెట్టారు. దాదాపు అన్నిచోట్లా పనులు పూర్తయ్యాయి. మొత్తం 10 రకాల సదుపాయాలను కల్పించారు.
రంగులు వేయడం దగ్గర్నుంచి కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, మొక్కల పెంపకం, మంచినీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయం.. ఇలా అన్ని పనులు పూర్తి చేశారు. నాడు-నేడు అంటూ ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, చాలా చోట్ల కనపడుతున్న వాస్తవాలు జగన్ ముందుచూపుని చెప్పకనే చెబుతున్నాయి. నాడు-నేడు గురించి వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రచారం చేసుకోనక్కర్లేదు. ప్రతి ఊరిలో, ప్రతి స్కూల్ లో తేడా స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 45.38 లక్షలమంది పిల్లలకు విద్యాకానుక కిట్లను అందిస్తున్నారు. ఇవన్నీ జగన్ ప్రభుత్వ విజయాన్ని కళ్లకు కడుతున్నాయి.