iDreamPost
android-app
ios-app

మిథున్ ప్రత్యేకమైన యువనాయకుడు

మిథున్ ప్రత్యేకమైన యువనాయకుడు

మిథున్ రెడ్డిని తొలిసారి పాతికేళ్ల క్రితం చూశాను. లండన్ లో చదువుకుంటున్నాడు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని మిథున్ తరువాతి రోజుల్లో రెండుసార్లు ఎంపీగా, ప్యానెల్ స్పీకర్ గా పనిచేస్తాడని అసలు ఊహించలేదు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  జనంతో మంచి సంబంధాలున్న నాయకుడైనప్పటికి 1994లో ఎన్టీఆర్ గాలిలో ఓడిపోయారు. తరువాత చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఒకవైపు చంద్రబాబు హవా, కాంగ్రెస్ లో విపరీతమైన విభేదాలు, ఇంకోవైపు పీలేరు నియోకవర్గంలో బలాన్ని సమీకరించుకోవాలి, ఈ నేపథ్యంలో తండ్రికి చేదోడుగా మిథున్ నిలబడ్డారు. మాట నిక్కచ్చితనం, ఎదుటవారిని గౌరవించే విషయంలో అందరినీ ఆకట్టుకున్నారు. పెద్దిరెడ్డి అందుబాటులో లేనపుడు మిథున్ తోనే జనం సమస్యలు చెప్పుకునేవారు.

1999లో కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు మళ్ళీ వచ్చాడు. పెద్దిరెడ్డి గెలవడమే కాకుండా, ఎవరికి తెలియని శ్రీధర్ రెడ్డిని పుంగనూరులో గెలిపించారు. దీని వెనుక మిథున్ రాజకీయ కృషి ఉంది. అప్పటి వరుకు శాసనసభలో అశోక్ గజపతి రాజు మాట్లాడే ఇంగ్లీష్ మీకు అర్ధం కాదంటూ హేళనగా మాట్లాడే టీడీపీ నేతలకు శ్రీధర్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే టీడీపీ ఎమ్మెల్యే ,మంత్రులు నోరెళ్ళబెట్టి చూసేవారు.

Also Read :  పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు..

2004 లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. పెళ్లితో మిథున్ కి జగన్ తో బంధుత్వం ఏర్పడింది. ఒకే ఏజ్ గ్రూప్ కావటం,ఇద్దరు వ్యాపార బాధ్యతలు చూస్తుండటం తదితర అంశాలు వలన మిథున్ జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారారు.2009లో పెద్దిరెడ్డి మంత్రి అయ్యారు. తరువాత వైఎస్ మృతితో కాంగ్రెస్ తో జగన్ తెగతెంపులు చేసుకున్నారు. రోశయ్య ప్రభుత్వంలో మళ్ళీ పెద్దిరెడ్డి మంత్రి. ఈ క్లిష్టమైన సందర్భంలో తండ్రి రాజకీయ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, జగన్ వెంట మిథున్ నడిచారు. కష్టకాలంలో ఒక కార్యకర్తగా, నాయకునిగా పనిచేసారు.

జగన్ సొంతంగా పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామాతో ఉప ఎన్నికలు వచ్చాయి. కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జిగా మిథున్ పనితీరును దగ్గరనుంచి చూశాను. తెల్లవారుజామునుండి అర్ధరాత్రి వరకు ప్రజల్లో తిరిగారు. అలసట లేని మిథున్ తానొక పెద్ద నాయకుడి కుమారుడినని ఎప్పుడూ అనుకోలేదు.

Also Read: WTC ట్విన్ టవర్స్,లాడెన్,సద్దాం,ఐసిస్ ,మళ్ళీ తాలిబన్- 20 ఏళ్ళలో జరిగింది ఇదే

తరువాతి రోజుల్లో జగన్ పాదయాత్ర చేసినప్పుడు, అంత పెద్ద కార్యక్రమం అడుగడుగునా విజయవంతం కావడానికి మిథున్ చేసిన కృషి చాలా కొద్దిమందికే తెలుసు.రాజంపేటలో సునాయాసంగా గెలవడానికి కారణం జగన్ గాలితో పాటు బలమైన ఓటు బ్యాంక్ ముస్లింలతో మిథున్ కి సన్నిహిత సంబంధాలు, పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లి ,రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ఆయనకి సుపరిచితం.

బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగం చేయాలనుకున్న మిథున్ రాజకీయలలోకి రావడానికి తండ్రి పెద్దిరెడ్డి కారణం అయితే, జగన్ పెద్దిరెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలకు,పార్టీలో కీలకంగా మారడానికి మిథున్ కారణం. లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా కూడా అందర్ని ఆకట్టుకుంటున్న మిథున్ కి జన్మదిన శుభాకాంక్షలు.

Also Read : విప్లవ రచయిత “అవంత్స”కు వైయస్సార్ మీద ఎలాంటి అభిప్రాయం ఉండేది?ఉండవల్లి ఏమి చెప్పారు?