Krishna Kowshik
జగపతి బాబు- అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. ఈ ఆగస్టు 9న విడుదల కాబోతుంది. ఈ టికెట్లు ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాడు నటుడు..
జగపతి బాబు- అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. ఈ ఆగస్టు 9న విడుదల కాబోతుంది. ఈ టికెట్లు ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాడు నటుడు..
Krishna Kowshik
బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన బ్యూటీఫుల్ అనసూయ భరద్వాజ్. క్షణం మూవీతో క్లిక్ అయిన ఈ స్టార్ యాంకరమ్మ.. అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. పుష్పలో దాక్షాయణి క్యారెక్టర్‌లో ఇరగదీసి.. పాన్ ఇండియన్ లెవల్లో పాపులారిటీని తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె పుష్ప 2తో పాటు కొన్ని ప్రాజెక్ట్ చేస్తుంది. వాటిల్లో ఒకటి సింబా. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళీ మనోహర్ డైరెక్టర్. తాజాగా ట్రైలర్ లాంచ్ చేసిన సంగతి విదితమే. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రాబోతోంది. కబీర్, శ్రీనాథ్ మాగంటి, వశిష్ట, దివి ఇతర పాత్రధారులు.
వృక్షో రక్షిత రక్షిత: అనే కాన్సెప్ట్‌తో సింబా మూవీ ఆగస్టు 9న రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో నటుడు శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. మొక్కలను నాటి సోషల్ మీడియాలో ఫోటోలు పంపితే.. టికెట్లు ఇస్తానంటూ ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పంపితే.. వాళ్లందరికీ మూవీ టికెట్స్ ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయని, అందరూ చూడాలంటూ పేర్కొన్నాడు. దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. సంపత్ నంది కథ అందించగా.. తాను డైరెక్ట్ చేశానని, రాజేందర్ నిర్మించేందుకు ముందుకు వచ్చారని, ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్ అని, మూవీ చూసి ఆదరించాలని కోరారు.
నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఈ మూవీ ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఉదయ భాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నా. అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కులు వేస్తారు’ అని అన్నారు. మొక్కలు నాటాలని, చెట్లను పెంచాలంటూ గతంలో కూడా సినీ ప్రేక్షకులకు హితబోధ చేసింది చిత్ర యూనిట్. అనసూయ సినిమాల విషయానికి వస్తే తమిళంలో ప్లాష్ బ్యాక్, ఉల్ఫ్ అనే రెండు ప్రాజెక్టులను చేస్తుంది.