Idream media
Idream media
సినిమా టికెట్ ధరలు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పరిశ్రమ తరఫున జగన్ కు తమ సమస్యలు విన్నవించడం, జగన్ వాటి పరిష్కారానికి సానుకూలత చూపడంతో ఇరుపక్షాలూ సంతోషం వ్యక్తం చేశాయి. టికెట్ ధరలకు సంబంధించి ఆమోదయోగ్యమైన జీవో త్వరలోనే విడుదలవుతుందని ఆ సందర్భంగా ప్రకటించారు కూడా. కాగా జగన్ తో చర్చల అనంతరం టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు నేడు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో సినీ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొననుండడంతో ప్రాధాన్యం ఏర్పడింది.
ఇప్పటికే సినిమా టికెట్లతో పాటు.. పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. సినీ పరిశ్రమ తరపున ముందుండి చిరంజీవి తదితర ప్రముఖులు వెళ్లి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినందుకు సీఎం వైఎస్ జగన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.. అయితే, ఈ వ్యవహారంలో నేడు టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు.. ఉదయం 11 కు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో సమావేశం జరగనుంది.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడంతో ఆసక్తికరంగా మారింది.
నేడు హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోషియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.. దాదాపు 240 మందిని ఈ సమావేశం కోసం ఆహ్వానించింది ఫిల్మ్ ఛాంబర్… చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశం తర్వాత జరగనున్న ఈ కీలక సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం అనంతరం సినీ ప్రముఖులు ఏం ప్రకటిస్తారో వేచి చూడాలి.
Also Read : టికెట్ రేట్ల సమస్యకు శుభం కార్డు.. మూడో వారంలో జీవో : చిరంజీవి