iDreamPost
android-app
ios-app

డబ్బు లోకంలో మునిగి తేలే ‘మోసగాళ్ళు’

  • Published Feb 25, 2021 | 10:48 AM Updated Updated Feb 25, 2021 | 10:48 AM
డబ్బు లోకంలో మునిగి తేలే ‘మోసగాళ్ళు’

మూడేళ్ళ క్రితం ఆచారి అమెరికా యాత్ర దెబ్బకు కొంత గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు ఈ సారి పాన్ ఇండియా లెవెల్ ని మించిన బడ్జెట్ తో మోసగాళ్లు సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మల్టీ లాంగ్వేజ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ విష్ణుకి సోదరిగా నటించడం ప్రత్యేకతను సంతకరించుకుంది. వరల్డ్ బిగ్గెస్ట్ ఐటి స్కామ్ ని ఇందులో చూపించబోతున్నట్టు ముందే ట్యాగ్ లైన్ లో హై లైట్ చేసిన టీమ్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ద్వారా ట్రైలర్ ని ఆన్ లైన్ వేదికగా లాంచ్ చేసింది. మరి బ్యాక్ డ్రాప్ భారీగా కనిపిస్తున్న మోసగాళ్లు ట్రైలర్ లోని విశేషాలు

మంచు విష్ణు డిఫరెంట్ క్యారెక్టర్ లో సెటిల్డ్ గా కనిపిస్తున్నాడు. పేదరికం నుంచి బయటపడి లోకాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలంటే డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గమనుకున్న ఓ యువకుడు(మంచు విష్ణు)టెక్నాలజీని వాడుకును జనాన్ని మోసం చేసే ఎత్తుగడలకు తెరతీస్తాడు. ఇతనికి సమాజంలో మంచి నెట్ వర్క్ ఉన్న మరో వ్యక్తి(నవదీప్)తోడవుతాడు. ఈ క్రమంలో సంచుల్లో గుట్టలుగుట్టలుగా కరెన్సీ వచ్చి పడుతుంది. ఇందులో ఆ యువకుడి సోదరి(కాజల్ అగర్వాల్)కూడా భాగమవుతుంది. ఏకంగా అమెరికాకే సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటారు. అప్పుడు వస్తాడు ఓ పోలీస్ ఆఫీసర్(సునీల్ శెట్టి). చివరికి ఈ కథ ఎక్కడికి చేరిందన్నది తెరమీదే చూడాలి.

కథ క్లియర్ గా చెప్పేసినప్పటికీ ఆసక్తి రేపెలా మంచి విజువల్స్ ని ఇందులో పొందుపరిచారు. ఎక్కువ స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే ఇలాంటి సినిమాలకు కావాల్సిన టెంపో ఉన్నట్టు అర్థమవుతోంది. విష్ణు, నవదీప్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్లు చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు ఉన్నారు. శ్యాం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది. మొత్తానికి అన్ని బాషలకు సరిపడా హై స్టాండర్డ్స్ అయితే సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇందులో చూపించిన కంటెంట్ కు తగ్గట్టు మోసగాళ్లు ఉంటే మాత్రం చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణుకి హిట్టు దొరికినట్టే. వెయిట్ అండ్ సి

Trailer Link @ https://bit.ly/2NCF2ds