Idream media
Idream media
రాజ్యసభ సభ్యుడు మోపీదేవి వెంకటరమణకు వైఎస్సార్‌సీపీ అధిష్ణానం కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రిగా ఉన్న మోపీదేవీ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచి పెద్దల సభకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మోపీదేవికి వైసీపీ అధ్యక్షుడు పార్టీ బాధ్యతలు కూడా అప్పగించారు. గుంటూరు జిల్లాకు చెందిన మోపీదేవికి ఆ జిల్లాతోపాటు, కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతలను అప్పజెప్పారు. ఆ రెండు జిల్లాలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తూ మోపీదేవి పార్టీని మరింత బలోపేతం చేయనున్నారు.
ఈ నెల ప్రారంభంలో పార్టీ బాధ్యతలను జిల్లాల వారీగా ముగ్గురు నేతలకు అప్పగిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విజయసాయి రెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, వైవీ సుబ్బారెడ్డికి ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా,గుంటూరు, చిత్తూరు జిల్లాలు, సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రకాశం,నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 17వ తేదీన సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించిన ఐదు జిల్లాల్లో రెండు జిల్లాల (ప్రకాశం, కర్నూలు) బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డికి కేటాయించిన ఐదు జిల్లాల్లో.. కృష, గుంటూరు జిల్లాలను మోపీదేవికి అప్పగించారు.
ఒక్కొక్కరు ఐదు జిల్లాల బాధ్యతలు పర్యవేక్షించడం కష్టమనే భావనలో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో.. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, వైవీ సుబ్బారెడ్డి ఉభయగోదావరి, చిత్తూరు, మోపీదేవి వెంకట రమణ కృష్ణా, గుంటూరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకాశం, కర్నూలు, సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల పార్టీ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.
Read Also : జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికే 8 లక్షల మందికి మేలు చేసింది