iDreamPost
iDreamPost
తమిళ కల్ట్ క్లాసిక్ 96 రీమేక్ గా మంచి అంచనాలతో బరిలో దిగిన జాను ఆశించిన అద్భుతాలు చేయడం లేదు కానీ పోటీ సినిమాలన్నీ తుస్సుమనడంతో వీకెండ్ ని బాగానే వాడుకునే పనిలో ఉంది. మొదటి రోజు కేవలం రెండు కోట్ల పై చిలుకు మాత్రమే షేర్ రాబట్టిన జాను నిన్న ఈ రోజు కలిపి ఎంత వస్తుందన్నది కీలకంగా మారనుంది. ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ వచ్చినపప్పటికీ అద్భుతం అనే మాట ఎవరు అనకపోవడంతో టికెట్ల కోసం ఎగబడే సీన్ కనిపించడం లేదు.
ముఖ్యంగా బీసి సెంటర్స్ లో వసూళ్లు ఏమంత ఘనంగా లేవని ట్రేడ్ టాక్. పోనీ స్లోగా పికప్ అవుతుందా అంటే అదంత సులభంగా కనిపించడం లేదు.
రేపటి నుంచి అసలు అగ్ని పరీక్ష ఉంటుంది. సాధారణంగా సోమవారం నుంచి ఎలాంటి సినిమాకైనా డ్రాప్ ఉంటుంది. హిట్ టాక్ వస్తే అది తక్కువ స్థాయిలో యావరేజ్ అంటే 50 శాతం కంటే తక్కువగా కలెక్షన్లు పడిపోతాయి. జాను ఇప్పుడు ఏ క్యాటగిరీలో పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. శర్వానంద్ సమంతాలు తమవరకు బెస్ట్ ఇచ్చినప్పటికీ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఎలాంటి మార్పులు లేకుండా జిరాక్స్ చేయడంతో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చూసినవాళ్లలో కలుగుతోంది.
పైగా జాను రామ్ ల మీద సానుభూతికి బదులు ఇదేంటి మరీ నెమ్మదిగా ఉందనుకుంటూ బయటికి వస్తున్న ప్రేక్షకులే ఎక్కువగా ఉన్నట్టు పబ్లిక్ టాక్ ని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ జాను కనక రేపు నాలుగు రోజులు స్టడీగా రన్ అయితే నిశ్చింతగా ఉండొచ్చు. అసలే శుక్రవారం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ గా రాబోతున్నాడు. అప్పటికప్పుడు జాను తీసేయరు కానీ థియేటర్ల కౌంట్ లో మార్పు వచ్చేస్తుంది. మరి రేపటి నుంచి ఎదురుకాబోయే పరీక్షను జాను ఎలా పాస్ అవుతుందో చూడాలి. అసలే 21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిస్క్ లోనే ఉంది.